Friday, May 3, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డి చూసి మహేష్ ఏమన్నాడంటే..?

- Advertisement -

అర్జున్ రెడ్డి.. వివాదాలతో స్టార్ట్ అయ్యి.. సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమా సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉందని.. కొందరు అంటుంటే.. మరి కొందరు.. ఇది చాలా డిఫరెంట్ మూవీ అని అంటున్నారు. తాజా ఈ మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. అర్జున్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు.

హీరో విజయ్ దేవరకొండతో పాటుగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ను అభినందించాడు. బోల్డ్, రా, ఇంటెన్స్, ఒరిజినల్ అండ్ బ్రిలియంట్ అంటూ.. అర్జున్‌ రెడ్డి సినిమాను ఆకాశానికెత్తారు. ‘మూస ధోరణిలో వస్తున్న చిత్రాలకు అర్జున్‌ రెడ్డి ఓ కొత్త మార్గాన్ని చూపించింది. అర్జున్ రెడ్డిగా లైఫ్ టైం పర్ఫార్మెన్స్‌తో విజయ్‌ దేవరకొండ అదరగొట్టారు. అద్భుతంగా నటించారని చెప్పడం కూడా తక్కువే. శాలిని, అర్జున్ రెడ్డి స్నేహితులు, మిగతా అన్ని పాత్రలు బ్రిలియంట్‌గా ఉన్నాయి.

దర్శకుడిగా సందీప్‌ వంగా కథ రాసుకొని తెరకెక్కించిన విధానం బాగుంది. తొలి సినిమానే ఇంత అద్భుతంగా తీయడం నమ్మలేకపోతున్నా’ అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు అంటూ.. మహేష్ ట్వీట్ పెట్టాడు. ఇదిలాఉండగా ఓ పక్క సినిమా నిలిపివేయాలంటూ అభ్యంతరాలు వస్తున్నా మరోవైపు సినీ ఇండస్ట్రీ లోని అగ్ర హీరోల ప్రశంసలు అందుకోవడం యూనిట్ సభ్యులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి మరో 15 నిమిషాలు సినిమాలో కలపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -