Monday, May 6, 2024
- Advertisement -

అన్న‌వ‌స్తున్నాడు పాద‌యాత్ర‌పై డైల‌మాలో నేత‌లు….

- Advertisement -

ప్ర‌తిప‌క్ష వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ వ‌చ్చె నెల‌లో పాద‌యాత్రను మొద‌లు పెట్ట‌నున్నారు. ఇడుపుల పాయ‌నుంచి ఇచ్చాపురం వ‌ర‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేస్తున్నాన‌ని విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ప్లీన‌రీలో ప్ర‌క‌టించారు. దీంతో నేత‌లు,ఇత‌ర కార్య‌క‌ర్త‌ల్లో ఆత్మ‌విశ్వాసాన్ని పెంచింది. అయితే నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల ఫ‌లితాలు పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ‌కు గురిచేశాయి. పాద‌యాత్ర చేయ‌డానికి మిన‌హాయింపు ఇవ్వాల‌ని జ‌గ‌న్ పెట్టుకున్న పిటీష‌న్‌ను కోర్టు తోసి పుచ్చ‌డంతో జ‌గ‌న్‌కు షాక్ త‌గిలింది.

కోర్టు తీర్పుతో పాద‌యాత్ర ఎలా చేయాల‌నేది ఇప్పుడు వైకాపాలో ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇడుపుల‌పాయ నుంచి ఇచ్చాపురం వ‌ర‌కూ పాద‌యాత్ర అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు క‌ల‌గ‌లుపుతూ న‌డుస్తా అన్నారు. పాద‌యాత్ర‌ను మొద‌లు పెట్టినా ప్ర‌తి శుక్ర‌వారం సీబీఐ కోర్టుకు హాజ‌ర‌వ్వాల్సిందే. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేత‌ల్లో నిరాశ క‌లిగిస్తోంది. పాద‌యాత్ర‌కు బ్రేకులు ఇస్తూ… మ‌ధ్య‌లో హైద‌రాబాద్ వ‌చ్చి వెళ్తూ పాద‌యాత్ర చేయ‌డం అనేది కాస్త ఇబ్బందిక‌ర‌మైన వ్య‌వ‌హార‌మ‌న‌డంలో సందేహం లేదు.

ధైర్యం చేసి పాద‌యాత్న‌ను మొద‌లు పెట్టినా …టీడీపీ విమ‌ర్శ‌ల‌కు ఆస్కారం ఇచ్చిన‌ట్లు అవుతుంది. దీంతోనె వైసీపీ నాయ‌కులు త‌ర్జ‌నా భ‌ర్జ‌నా ప‌డుతున్నారు. ఇదే అంశ‌మై జ‌గ‌న్ సుప్రీం కోర్టుకు వెళ్లే అవ‌కాశాలున్నాయ‌ని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌గ‌న్ ఎదుర్కొంటున్న ఆర్థిక నేరారోప‌ణ‌లు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కూడా ప్రభావం చూపేవిగా ఉన్నాయంటూ న్యాయ‌వాదులే చాలా సంద‌ర్భాల్లో అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో సుప్రీంను ఆశ్ర‌యించ‌డం స‌రైన ప‌ద్ధ‌తా కాదా అనే చ‌ర్చ కూడా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్లీన‌రీలో ప్ర‌క‌టించిన‌పుడే ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. చూడాలి పాద‌యాత్ర‌పై ఎంత‌మేర ప్ర‌భావం చూపుతుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -