Tuesday, May 7, 2024
- Advertisement -

మ‌హర్షి ‘ఛోటీ ఛోటీ బాతేన్’ సాంగ్‌ అదిరిపోయింది..!

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు తాజాగా న‌టిస్తున్న చిత్రం మ‌హర్షి. ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా పూజా హెగ్డె హీరోయిన్‌గా న‌టిస్తుంది. సినిమా విడుద‌ల తేదీని ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో సినిమా ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్టింది. సినిమా నుంచి కొత్త‌గా రెండు పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేసిన సినిమా యూనిట్ ,తాజాగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ రోజు 9 గంటల 09 నిముషాలకు ఈ పాట‌ను విడుద‌ల చేశారు.

ఈ పాట‌ ఛోటీ ఛోటీ బాతేన్ అంటూ సాగుతోంది. ఈ పాట‌ను దేవీనే పాడ‌టంతో పాట విన‌డానికి మ‌రింత అందంగా ఉంది. పాట విడుద‌ల అయిన గంట‌లోపే 10 వేల మంది ఈ లిరిక‌ల్ సాంగ్‌ను వీక్షించారు. ఈ సినిమా మ‌హేశ్ కెరీర్‌లో 25వ సినిమా కావ‌డంతో మ‌హ‌ర్షిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా కోసం ఫ‌స్ట్ టైమ్ మ‌హేశ్ ఫుల్‌గా గెడ్డం, మీసం పెంచారు. భారీ అంచ‌నాలు ఉన్నా ఈ సినిమాను మే9న విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -