Wednesday, May 8, 2024
- Advertisement -

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ ట్విట్ట‌ర్ రివ్యూ

- Advertisement -

వివాస్ప‌వ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడు వివాద‌ల‌తో వార్త‌ల్లో నిల‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. వ‌ర్మ తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ల‌క్షీస్ ఎన్టీఆర్‌. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి , తెలుగు వెండితెర దైవం నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌లోని కొన్ని సంఘ‌ట‌ల‌న ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ జీవితంలోకి ఆయ‌న రెండో భార్య ల‌క్ష్మీ పార్వ‌తీ ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌ర నుంచి ఈ సినిమా నిర్మిచ‌డం జ‌రిగింది. ఎన్టీఆర్ త‌న చివ‌రి రోజుల్లో ఎలాంటి దుర్భ‌ర జీవితాన్ని గ‌డిపాడో త‌న సినిమాలో చూపిస్తానంటున్నాడు వ‌ర్మ‌.

ముఖ్యం ఏపీ సీఎం, ఎన్టీఆర్ అల్లుడు చంద్ర‌బాబును టార్గెట్ చేసుకుని ఈ సినిమాను నిర్మించారు. అస‌లే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డటం, ఇదే స‌మ‌యంలో ఈ సినిమా కూడా విడుద‌లకు రెడీ అవుతుండ‌టంతో అంద‌రు ఈ సినిమా గురించే చ‌ర్చించుకుంటున్నారు. ఈ సినిమా విడుదల అయితే త‌మ పార్టీకి డ్యామేజీ జరుగుతుంద‌ని భావించిన టీడీపీ పార్టీ సినిమాను విడుద‌ల కాకుండా అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తుంది. దీనిలో కొంత స‌ఫ‌లం చెందింది ఆ పార్టీ. సినిమాను ఏపీలో విడుద‌ల కాకుండా అడ్డుప‌డింది. సినిమాను తాము చూసిన త‌రువాత విడుద‌ల చేస్తామ‌ని ఏపీ హైకోర్టు తెలిపడంతో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అక్క‌డ విడుద‌ల కావ‌డంలేదు. అయితే ప‌క్క‌నే ఉన్న తెలంగాణ రాష్టంలో సినిమా విడుద‌ల అయింది. ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్ప‌న్స్ వ‌స్తోంది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

సినిమా బాగుందని, ఇలాంటి కథను ధైర్యంగా తెరకెక్కించిన వర్మ గట్స్ ను మెచ్చుకోకుండా ఉండలేమని అంటున్నారు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య జరిగిన ఓల్డేజ్ ప్రేమ క‌థ‌ను బాగా తెర‌కెక్కించాడట‌ వ‌ర్మ‌. కళ్యాణి మాలిక్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు ప్లస్ అని అంటున్నారు. లక్ష్మీపార్వతి రోల్ లో యజ్ఞాశెట్టి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందని చెబుతున్నారు. ఎన్టీఆర్ పాత్రలో పి.విజయ్ కుమార్ చక్కగా నటించారని కొనియాడుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లక్ష్మీపార్వతి గురించి కాస్త ఎక్కువగా చూపించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్త‌నికి సినిమా బాగానే ఉందని టాక్ వినిపిస్తోంది. పూర్తి రివ్యూను మ‌రి కొద్దిసేప‌ట్లో మీ ముందు ఉంచుతాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -