Tuesday, April 23, 2024
- Advertisement -

అధికారుల బ‌దిలీ వ్య‌వ‌హారం : హైకోర్టులో ఏపీ ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌…

- Advertisement -

ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూగ్గురు ఐపీఎస్ అధికారులను బ‌దిలీ చేసింది సీఈసీ. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం హైకోర్టుకు వెళ్లింది. అక్క‌డ కూడా టీడీపీ ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ త‌గిలింది. ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు సహా కడప, శ్రీకాకుళం ఎస్పీలను కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేవేసింది. ఈసీ నిర్ణ‌యాల‌ను శిర‌సా వ‌హించాల్సిందేన‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈసీ అధికారాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని వెల్లడించింది.

టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న వైసీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో ఇటీవల వెంకటేశ్వరరావుతో పాటు కడప ఎస్పీ రాహుల్ దేవ్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంలను ఈసీ బదిలీ చేసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఎస్పీ రాహుల్ దేవ్ ను బదిలీ చేయడం సరికాదని వాదించింది. సీఈసీ త‌రుపు న్యాయ‌వాధి స్పందిస్తూ.. ఈ బదిలీలు తాత్కాలికమేనని స్పష్టం చేశారు. ఈ బదిలీలు ఎలాంటి శిక్ష కాదనీ, ఓసారి పోలింగ్ పూర్తయ్యాక వీరంతా తిరిగి తమ విధుల్లో చేరవచ్చని తేల్చిచెప్పారు. ఈసీ, ఏపీ ప్రభుత్వం వాదనలు విన్న ఏపీ హైకోర్టు… ఐపీఎస్ల బదిలీలను నిలిపివేయాలన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -