Sunday, May 5, 2024
- Advertisement -

మహేశ్ బాబు.. పవన్ కల్యాణ్ పై పవర్ ఫుల్ పంచ్ వేశాడా!

- Advertisement -

మీరు రీమేక్ సినిమాలను చేయడానికి ఎందుకు ఆసక్తి చూపరు? అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ రీమేక్ లు అంటే తనకు అస్సలు ఆసక్తి ఉండదని ప్రిన్స్ స్పష్టం చేశాడు.

కేవలం తనకు నచ్చదు అనడమేకాదు.. అసలు రీమేక్ ప్రక్రియనే తప్పుపట్టాడు.

ఒకసారి తీసిన సినిమాను మరోసారి తీయడం బోర్ అని మహేశ్ వ్యాఖ్యానించాడు. కొత్తగా ఏం నేర్చుకొంటున్నాం.. అనే ఆసక్తి లేనప్పుడు పనిచేయడం అసలు బాగుండదని మహేశ్ వ్యాఖ్యానించాడు.

ఈ విధంగా రీమేక్ లపై తన వ్యతిరేకతను .. ఆ ప్రక్రియల తీరును మహేశ్ తప్పుపట్టాడు. మరి మహేశ్ ఈ విధంగా రీమేక్ లను వ్యతిరేకిస్తుంటే.. ఇది పరోక్షంగా పవన్ కల్యాణ్ పై పంచ్ వేసినట్టుగానే ఉంది. ఎందుకంటే.. తెలుగు తెరపై ఎక్కువగా రీమేక్ ల పట్ల ఆసక్తి చూపే హీరోల్లో పవన్ ఒకరు. వెంకటేశ్ తర్వాత పెద్ద హీరోల్లో రీమేక్ లను చేసే హీరో కూడా పవన్ కల్యాణే అని చెప్పాలి.

ప్రస్తుతం కూడా పవన్ బజరంగీ భాయ్ జాన్ సినిమా రీమేక్ గురించి కూడా ఆలోచిస్తున్నాడట పవర్ స్టార్. ఈ విధంగా మళ్లీ పవన్ రీమేక్ కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తుంటే.. మహేశ్ మాటలు ఆ తీరుపై పంచ్ లలాగా ఉన్నాయి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -