Sunday, June 16, 2024
- Advertisement -

నీతులు చెబుతూ నవ్వుల పాలవుతున్న నరేంద్రమోడీ!

- Advertisement -

ప్రధానమంత్రి అయిన కొత్త లో అయితే నరేంద్రమోడీ మాటకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది.

ఆయన అలా చెప్పాడని.. దేశాన్ని ఇలా బాగు చేద్దామని చెప్పాడని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్టులు కనిపించేవి. అయితే.. క్రమంగా మోడీ ఇమేజ్ మసకబారుతోంది.

ప్రధాని చేతల మనిషిగా కనిపించకపోవడం.. అనేక విషయాల్లో మోడీ విజయవంతం కాకపోవడంతో ఆయన ప్రభ తగ్గింది. అలాగే మోడీ ఖరీదైన సూటుబూట్ల వ్యవహారాలతో కూడా వార్తల్లోకి వచ్చాడు.

ఇలాంటి నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన ఒక ప్రకటన ఆసక్తికరంగా ఉంది. ఇంతకీ మోడీ జీ ఏం చెబుతారంటే.. సినిమాల్లో హీరోయిన్లు, యువత పట్టు వస్త్రాలను ధరించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈయన ఈ వ్యాఖ్య చేశారు. అయితే వస్త్రాల విషయంలో ఇప్పటికే మోడీపై విమర్శలు ఉన్నాయి. ఆయన విదేశాల నుంచి సూట్లను తెప్పించుకొని ధరిస్తాడని.. అత్యంత ఖరీదైన బ్రాండ్ దుస్తులనే ధరిస్తాడనే విమర్శలు న్నాయి. ఇలాంటి నేపథ్యంలో మోడీ దేశ యువతకు మాత్రం చేనేత దుస్తులు ధరించాలని సూచించారు.

మరి ఎవరైనా తాము అనుసరిస్తూ నీతులు చెబితే అదో ముచ్చట. అయితే మోడీ మాత్రం తను ఫారెన్ బ్రాండ్లను ధరిస్తూ.. సినిమాల్లో హీరోయిన్లు.. బయట  యువతీయువకులు చేనేత వస్త్రాలను ధరించాలని సూచిస్తున్నారు. ఇలా తను పాటించకుండానే అందరికీ నీతులు చెప్పడం మోడీ ఇమేజ్ ను కొంత వరకూ దెబ్బతీసే అంశమే. ముందుగా ఆయన ఫాలో అయ్యి అందరికీ నీతులు చెప్పాల్సి ఉంటుంది. ప్రదానమంత్రి అలా చేస్తే మేలేమో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -