Wednesday, May 15, 2024
- Advertisement -

వేరే హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి మహేశ్ రెడీ!

- Advertisement -

తమిళంలో ప్రముఖ హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. అర్థవంతమైన సినిమాలను నిర్మిస్తూ ప్రశంసలు అందుకొంటున్నారు.

మరి మీరెందుకు అలా చేయడం లేదు? అన్న అభిమాలను ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు ప్రిన్స్ మహేశ్ బాబు. శ్రీమంతుడు విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశం గురించి వివరించాడు. ధనుష్ వంటి వాళ్లు చేస్తున్న ప్రయత్నాలను మహేశ్ అభినందించాడు. ధనుష్ నిర్మాతగా రూపొందించిన “కాకముట్టై” సినిమాను తను కూడా చూశానని.. అది తనకు బాగా నచ్చిందని ప్రిన్స్ చెప్పాడు.

తమిళులు ఆ విషయంలో అభినందనీయులు అని.. తెలుగులో కూడా అలా ఎవరైనా యువ దర్శకులు మంచి కథలతో వస్తే తను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమని మహేశ్ ప్రకటించాడు. అలాంటి కథలతో ఎవరైనా ముందుకు వస్తే తను ప్రోత్సహించడానికి సిద్ధమని మహేశ్ అన్నాడు. మరి ఇప్పటికే మహేశ్ నిర్మాతగా మారాడు. ‘ఎమ్ బీ ప్రొడక్షన్స్’ పై సినిమాలు తీస్తున్నాడు.

శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో పార్టనర్ గా ఉన్నాడు. మరి ఇప్పుడు యువ దర్శకులు మంచి కథలతో వస్తే వారి సినిమాలను ప్రాడ్యూస్ చేయడానికి సిద్ధమని ప్రిన్స్ ప్రకటించడం ఆసక్తికరంగా ఉంది. మరి మహేశ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి అద్భుతమైన సినిమాలు వస్తాయేమో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -