Thursday, May 16, 2024
- Advertisement -

రాహుల్ ద్రావిడ్ వల్లనే తను రాణించానంటున్న పాకిస్తానీ క్రికెటర్!

- Advertisement -

యూనిస్ ఖాన్.. పాకిస్తానీ మోస్ట్ సీనియర్ బ్యాట్స్ మన్. మాజీ కెప్టెన్ కూడా. చాలా సంవత్సరాల నుంచి కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

గత తరం లెజెండ్లతో కలిసి క్రికెట్ ఆడిన ఖాన్ నేటితరం యువ క్రికెటర్లతో కూడా కలిసి ఆడుతున్నాడు. పాకిస్తానీ తరపు గొప్ప బ్యాట్స్ మన్లలో ఖాన్ కూడా ఒకరు. మరి ఇప్పుడు ఈ క్రికెటర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. తన రాణింపు వెనుక ఒక భారతీయుడు ఉన్నాడని ఖాన్ స్పష్టం చేశాడు.

అది మరెవరో కాదు.. రాహుల్ ద్రావిడ్. టీమిండియా మాజీ కెప్టెన్.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ సలహాలూ, సూచనలు తనను మంచి బ్యాట్స్ మన్ గా తీర్చిదిద్దాయని యూనిస్ చెప్పాడు. కెరీర్ ఆరంభ దశలోనే రాహుల్ ను తాను కలిశానని.. అప్పట్లో ద్రావిడ్్ సూచనలతో బ్యాటింగ్ ను మెరుగుపరుచుకోగలిగాను అని ఖాన్ వివరించాడు. 

ఈ విధంగా రాహుల్ గొప్పదనాన్ని యూనిస్ వివరించాడు. ప్రస్తుతం ద్రావిడ్ భారత యువ జట్టుకు కోచ్ గా ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో ద్రావిడ్ గైడెన్స్ యువ ఆటగాళ్లకు కచ్చితంగా ప్లస్ పాయింటే అవుతుంది. వారు తమ ప్రతిభను మెరుగు పరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -