Friday, May 17, 2024
- Advertisement -

అతనే మహేష్‍కి నచ్చిన హీరో!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం అనే సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. పి వి పి సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల మే 20న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణతీ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ నేపధ్యంలో మహేష్ ఇచ్చిన ఇంటర్ వ్యూ లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని ఓ అభిమాని అడగ్గా వెంటనే మహేష్ స్పందిస్తూ ” హాలీవుడ్ సినిమాల్లోని  ‘హల్క్’  అంటే చాలా చాలా ఇష్టమని, అలాగే అలాంటి  పాత్రలు చేయడానికి సిద్దమేనని చెప్పుకొచ్చాడు. ఇక హాలీవుడ్ సినిమా అయిన ‘అవెంజేర్స్’ సినిమా అంటే కూడా చాల ఇష్టమని, తన పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార లతో కలిసి చాల సార్లు సినిమా చూశానని చెప్పుకొచ్చాడు.

గతంలో శ్రీమంతుడు చిత్రానికి ఎ విధంగా ఐతే ప్రమోషన్స్ చేసి సినిమా పై భారి హైప్ క్రియేట్ చేశాడో ఇప్పుడు మహేష్ చేస్తున్న బ్రహ్మోత్సవం చిత్రానికి కూడా అంత కంటే ఎక్కువ హైప్ క్రియేట్ చేయడానికి భారి ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -