Thursday, May 16, 2024
- Advertisement -

మరోసారి పవన్ పేరు చెప్పను బ్రదర్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పను అంటే చెప్పను అని అల్లు అర్జున్ మొండికేస్తున్నాడు. అసలు పవన్ స్టార్ అంటే అల్లు అర్జున్ కి కోపమా? లేక పవన్ గురించి నేను మాట్లాడటం ఎందుకు? అని అనుకుంటున్నాడో ఏమో కానీ పవన్ పేరు మాత్రం చెప్పను అంటున్నాడు.

ఇప్పటికే పవన్ పేరు చెప్పనని స్పష్టం చేసిన బన్నీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ఆ గొడవ ఇంకా సద్దుమణగక ముందే మరోసారి పవన్ పేరు చెప్పను బ్రదర్ అంటూ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు అల్లు అర్జున్.

మెగా కుటుంబంలో ఎవరి వేడుక జరిగినా కామన్ పాయింట్ ఒకటుంది అక్కడ పవన్ భజన . పవన్ కళ్యాణ్ ఆ ఫంక్షన్ కు వచ్చినా రాకున్నా అక్కడ మాత్రం ”పవర్ స్టార్ …….. పవర్ స్టార్ ” అంటూ అభిమానులు గోల చేస్తూనే ఉంటారు. ఆ గోల ఈమధ్య మరీ ఎక్కువయ్యింది. దాంతో అల్లు అర్జున్ మీరు చెప్పమంటే చెప్పను నేను చేప్పలనుకున్నదే చెబుతాను అంటూ పవన్ పేరు చెప్పనని ఇటీవల సరైనోడు సక్సెస్ మీట్ లో చెప్పాడు. తాజాగా ఓ దిన పత్రిక తో మాట్లాడుతూ పవన్ గురించి ప్రశ్న వేస్తే చెప్పను  అంటూ మరోసారి చెప్పడంతో అసలు పవన్ అంటే అల్లు అర్జున్ కు కోపమా ? అన్న చర్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -