ఎన్టీఆర్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో..’ ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ మిలియన్ హిట్స్ దాటి దూసుకుపోతోంది .ట్రైలర్ యుట్యూబ్‍లో సంచలనం సృష్టిస్తుంది. ఇదివరకు ఏ తెలుగు మూవీ ట్రైలర్ సాధించని లైక్స్ ఈ చిత్రానికి లభించాయి.
సుకుమార్ క్రియేటివిటి, ఎన్టీఆర్ స్టైలిష్ లుక్స్ ఈ ట్రైలర్‌కి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.ఈ సినిమా ట్రైలర్ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజమాళి కూడా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. ఐతే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ నాన్నకు ప్రేమతో ట్రైలర్ చూసాడట.
ట్రైలర్ బాగా నచ్చడంతో ఎన్టీఆర్ కి ఫోన్ చేసి అభినందించారట. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్స్ చాలా బాగుందని అతని నటన చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని చెప్పారట. సంక్రాంతి బరిలో జనవరి 13న ఈ సినిమా రిలీజ్ చేయలని చూస్తున్నారు.
