Tuesday, May 21, 2024
- Advertisement -

మహేశ్ బాబు కోరుకున్నది జరిగినట్టేనా..!

- Advertisement -

ఆది నుంచి బావ సుధీర్ బాబు సినిమాలను ప్రమోట్ చేస్తూ వచ్చిన మహేశ్ బాబు ‘భలే మంచి రోజు’ విడుదలకు ముందు మాత్రం ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. ఒక్క హిట్ దక్కితే చాలు సుధీర్ బాబు స్టార్ హీరో అయిపోతాడని మహేశ్ చెప్పుకొచ్చాడు.

ఇంతకు ముందు బావ చాలా సినిమాలే చేసినా, వాటిల్లో తన ప్రతిభను నిరూపించుకున్నా.. హిట్ అనే అదృష్టం మాత్రం కలిసి రాలేదు.. అనేది మహేశ్ భావన. బావకు అదొక్కటీ కలిసొస్తే తిరుగే ఉండదు.. అని ఆయన అన్నాడు.

మరి ఇప్పుడు ‘భలేమంచిరోజు’ పట్ల వినిపిస్తున్న టాక్.. వచ్చిన పాజిటివ్ రివ్యూల తీరును చూస్తుంటే.. ఆ లోటు తీరినట్టుగానే ఉంది. ఈ సినిమా బాగుందన్నమాట అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. కొత్త డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన ఈ సినిమా థ్రిల్లర్ లా ఆకట్టుకుందని.. ఈ డైరెక్టర్ కృష్ణవంశీ రేంజ్ లో కనిపిస్తున్నాడని అంటున్నారు. మరి ఇలాంటి ప్రచారం భలేమంచి రోజు కలెక్షన్లను పెంచగలిగితే.. సినిమా హిట్ అయినట్టే. పూర్తిగా కలెక్షన్ల వివరాలు తెలిసే వరకూ ఈ సినిమా హిట్టో ప్లాఫో సామాన్యులకు తెలిసే అవకాశం లేదు. మరి మహేశ్ అనుకున్నది జరిగిందోలేదో ప్రస్తుతానికి మిస్టరీనే! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -