Wednesday, May 22, 2024
- Advertisement -

శంకర్ – రజినీకాంత్ ల సినిమా కాపీ ?

- Advertisement -

400 కోట్ల భారీ బడ్జెట్ తో సౌత్ ఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రోబో 2 షూటింగ్ ఈ మధ్యనే మొదలయ్యి శరవేగంగా జరుపుకుంటుంది. ఎన్నడూ లేని విధంగా శంకర్ యమ ఫాస్ట్ గా తొలి షెడ్యూల్ ని ఈ నెల 30 తో ముగించాబోతున్నాడు. కాగా ఈ సినిమా స్టోరీ ఎక్కువగా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఐరన్ మాన్ నుండి ఇన్స్పైర్ అయినట్లు కోలివుడ్ లో వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా ఐరన్ మాన్ 2 లో వాడిన రోబోల టైప్ నమూనాలతో శంకర్ ఇందులో ప్రయోగాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ రోల్ కూడా ఐరన్ మాన్ 2 నుండి తీసుకున్నట్లు సమాచారం. రజినీకాంత్ సృష్టించిన మొదటి రోబో వల్ల నష్టపోయిన విలన్ ఎలా రజినీపై పగ తీర్చుకున్నాడో అదే స్టోరీ అట.

దాదాపు ఐరన్ మాన్ 2 ని పోలి ఉండే ఈ స్టోరీలో అమీజాక్సన్ కూడా విలన్ బ్యాచ్ లో నటిస్తుందట. కాగా వీళ్ళని ఎదిరించడానికి రోబోలను సృష్టించడం మానేసిన వశీకర్ ఎలాంటి ఓ కొత్త రోబోని రెడీ చేసి విలన్స్ ని అడ్డుకున్నాడో అదే సినిమా స్టోరీ అని అంటున్నారు. దాంతో ఇప్పటినుండే సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగినట్లైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -