Wednesday, May 15, 2024
- Advertisement -

పూరీ కొత్త కహానీలు చెబుతున్నాడు.. వినండి!

- Advertisement -

” ఈ సినిమాలో చేసిన పాత్రతో పోసానికి విపరీతంగా ఫోన్స్ వచ్చాయి.. దాదాపు ఐదు వేల కాల్స్ వచ్చాయి.. వారంతా పోసానిని అభినందిస్తూ కాల్స్ చేశారు!

కొందరైతే రేవతిని ‘అమ్మ’ అని పిలవమా అని అడిగారట!

ఎక్కడెక్కినా హీరో వరుణ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడి గురించి అనేక  మంది వాకబు చేస్తున్నారు.” 

ఇవన్నీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇప్పుడు చెబుతున్న మాటలు.

తన సినిమా ‘లోఫర్’ ప్రమోషన్ కోసం పూరీ ఈ మాటలన్నీ చెబుతున్నాడు. సినిమా సూపర్ గా ఉంది.. చూడండి, అని చెప్పడానికి పూరీ ఈ ఎత్తుగడలు వేస్తున్నాడు. ‘లోఫర్’ అట్టర్ ప్లాఫ్ గా డిక్లేర్డ్ అయ్యింది. విడుదలకు ముందు దాదాపు 19 కోట్ల రూపాయల బిజినెస్ చేసిన ఈ సినిమా పది కోట్ల రూపాయల స్థాయి వసూళ్లను కూడా సాధించలేదని తెలుస్తోంది. దీంతో దీన్ని కొన్న బయ్యర్లు నిండా మునిగినట్టే అని తెలుస్తోంది.

మరి ఈ పరిస్థితిలోకొంత మార్పు తీసుకురావడానికి వర్మ ఈ ప్రమోషన్ ను మొదలుపెట్టాడు. సినిమా సూపరని ప్రచారం చేస్తున్నాడు. అది కూడా సినిమా విడుదలయిన మూడు వారాల తర్వాత వర్మ ఈ కబుర్లను చెబుతున్నాడు. మరి పూరీ ప్రచారం లోఫర్ బయ్యర్లను ఎంత వరకూ రక్షించగలుగుతుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -