Sunday, May 26, 2024
- Advertisement -

అలా అయితే కుదరదని శ్రీకాంత్ అడ్డాలకు చెప్పేసిన మహేశ్!

- Advertisement -

శ్రీకాంత్ అడ్డాలకు సెకెండ్ ఛాన్స్ ఇచ్చాడు మహేశ్ బాబు. ఇప్పటికే ఆ దర్శకుడితో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాను చేసిన మహేశ్ ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ చేస్తున్నాడు.

మరి మహేశ్ వంటి హీరో సెకెండ్ చాన్స్ ఇచ్చాడంటే ఆ దర్శకుడి పనితీరు బాగానే నచ్చి ఉండాలి. అయితే… ఇలా చేస్తున్నప్పటికీ మహేశ్ ఈ సారి శ్రీకాంత్ కు కొన్ని కండీషన్లు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ కండీషన్లు ఏమనగా.. ఎటు తిరిగీ సినిమాను తొందరగా పూర్తి చేయాలి. కనీసం ఆరు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి కావాలి. అని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.

శ్రీకాంత్ అడ్డాలకు ఒక శైలి ఉంది. సినిమాను వీలైనంత ఎక్కువ రోజులు షూటింగ్ జరపడం ఆయన స్టైల్ , ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ విషయంలో అదే జరిగింది. అలాగే ‘ముకుందా’ సినిమా షూటింగ్ కూడా చాలా రోజులే పట్టింది. ఇలాంటి నేపథ్యంలో ఆటోమెటిక్ గా బ్రహ్మోత్సవం కూడా చాలా కాలాన్నే తీసుకునే అవకాశం ఉంది. దీంతో… విషయాన్ని గ్రహించి మహేశ్ దర్శకుడికి తన మనసులో మాటను చెప్పేసినట్టు సమాచారం.

ఇప్పటికే చాలా మంది దర్శకులు మహేశ్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో వాళ్లను దృష్టిలో పెట్టుకుని అయినా.. మహేశ్ ఈ సినిమాను తొందరగా పూర్తి చేయాల్సి ఉంది. అందుకే శ్రీకాంత్ అడ్డాలపై ఒత్తిడి చేస్తున్నట్టుగా సమాచారం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -