Saturday, May 25, 2024
- Advertisement -

తనతో నటించిన హీరోయిన్ నే పెళ్లి చేసుకుంటున్న వరుణ్ సందేశ్!

- Advertisement -

హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడు. విశేషం ఏమిటంటే..

ఈ హీరోతనతో నటించిన అమ్మాయినే వివాహం చేసుకొంటుండటం. వరుణ్ సందేశ్ కు కాబోయే భార్య పేరు వితికా షేరూ. ఆమె ఇది వరకూ ఈ హీరో పక్కన “పడ్డానండీ ప్రేమలో మరి’ అనే సినిమాలో నటించింది. అప్పటి నుంచి వీరికి పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ పరిచయమే ప్రేమగా మారి వీరు వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం.

ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు కానీ.. వీరిద్దరినీ భార్యభర్తలుగా చేయడానికి మాత్రం ఉపయోగపడుతున్నట్టుగా ఉంది. కొంచెం లోప్రొఫైల్ లోనే వివాహం చేసుకోవాలని ఈ జంట భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ల పెద్ద వాళ్లు కూడా ఈ ప్రేమ వివాహానికి సమ్మతం తెలిపి ఆశీర్వదిస్తున్నారు. అతి త్వరలోనే వీళ్ల పెళ్లి జరిగే అవకాశం ఉంది. మొత్తానికి వరుణ్ సందేశ్ ఒక ఇంటివాడయిపోతున్నాడనమాట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -