ఏ.ఆర్.మురుగుదాస్ డైరక్షన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ”స్పైడర్”. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక విభిన్న పాత్రలో కనిపిస్తున్నాడని తెలిసిన విషయమే. అయితే గతంలో తెలిసినట్లు.. ఈ సినిమా కోసం లండన్ లో చేసిన గ్రాఫిక్స్ హైలైట్ అవ్వనున్నాయని ఇప్పుడు టీజర్ చెప్పకనే చెబుతోంది.
{loadmodule mod_custom,Side Ad 1}
టీజర్లోని స్పై అనే అక్షరాలు చూస్తే.. ఇది ఒక గూడచారి స్టోరీ అని తెలుస్తోంది. అయితే మొత్తంగా ”స్పైడర్” అని పెట్టడంతో.. డెఫినెట్ గా ఈ సినిమాలో స్పైడర్ అనే సాలీడు పెద్ద పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. ఇప్పుడు టీజర్లో ఆ మెకానికల్ స్పైడర్ ను పరిచయం చేశాడు మురుగుదాస్. ట్రాన్స్ ఫార్మర్స్ సినిమాలో ఆటోబాట్స్ తరహాలో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన సాలీడు.. కంప్యూటర్ ముందు ఏదో పనిలో నిమగ్నమైన మహేష్ బూటుపై ఎక్కి.. అక్కడి నుండి పాకుతూ అతని భుజం మీదకు ఎక్కేసింది.
{loadmodule mod_custom,Side Ad 2}
ఇక ఆ భుజం మీద ఎక్కి అల్లరి చేస్తుండటంతో.. పక్కకు తిరిగి వెంటనే మహేష్ ‘ఉష్’ అనడంతో టీజర్ ఎండ్ అయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే.. టాలీవుడ్ లో వస్తున్న తొలి ఒరిజినల్ సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు. కొత్త కథతో వస్తున్న మహేష్ బాబు ఈ సారి ఖచ్చితంగా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడూ.
{youtube}ZuCUc6v9u94{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related