రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడంటే..?

Mahesh Babu SS Rajamouli Movie Launching Date Locked
Mahesh Babu SS Rajamouli Movie Launching Date Locked

రాజమౌళి ఒక్క టాలీవుడ్ కే కాదు. దేశంలోనే నంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇంతవరకు అపజయం లేని రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు దేశంలోని అన్ని భాషల నటీ నటులు ఎదురు చూస్తుంటారు. భారీ చిత్రాలను తెరకెక్కించే రాజమౌళి ఇండస్ట్రీ కి 20 ఏళ్లు అయినా చేసింది తక్కువ సినిమాలే. ఇప్పటి దాకా తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, నితిన్, రామ్ చరణ్, నాని, సునీల్ మాత్రమే హీరోలుగా నటించారు.

ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా కేటగిరి లోనే సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన ఎక్కువగా చారిత్రక కథలనే చేస్తుండటంతో మహేష్ తో చేసే సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని అంతా భావించారు.

SSMB29 పేరుతో, ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబ్-ట్రోటింగ్ యాక్షన్-అడ్వెంచర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. సూపర్‌స్టార్ పుట్టినరోజు అయిన ఆగస్ట్ 9, 2023న ఈ సినిమా లాంచ్ అవుతుందని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తారని కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది మరియు ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ ఈ మెగా బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.