శ్రీమంతుడు సినిమాలో ఒక ప్రత్యేకమైన యువకుడి పాత్రలో కనిపించాడు ప్రిన్స్ మహేశ్ బాబు.
ఊరి కోసం పాటు పడే ధనవవంతుడైన యువకుడిగా కనిపించాడాయన. కొద్దిపాటి రొమాన్స్ కూడా కలగలిసినా.. శ్రీమంతుడు లో కొన్ని లక్ష్యాలకు కట్టుబడ్డ యువకుడిగా మహేశ్ కనిపించాడు. మరి అలా స్ట్రిక్ట్ గాకనిపించిన తరువాతి సినిమాలో మహేశ్ అందుకు పూర్తి విరుద్ధంగా కనిపించబోతున్నాడు. ఆయన ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్ ఒక ప్లేబాయ్ పాత్రలో కనపించబోతున్నాడు!
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ ముగ్గురు హీరోయిన్లతో మహేశ్ కు ఫుల్ రొమాన్స్ ఉండబోతోంది! దీంతో ‘బ్రహ్మోత్సవం” సినిమా కలర్ ఫుల్ గా మారనుంది. రొమాన్స్ ను చిత్రీకరించడంలో శ్రీకాంత్ అడ్డాలకు ప్రత్యేకత ఉంది. అమ్మాయిలతో రొమాన్స్ ను పండించడంలో మహేశ్ కు కూడా ప్రత్యేకత ఉంది. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. మరి అప్పుడెప్పుడో నాని సినిమాలో ఒక విధమైన ప్లేబాయ్ గా నటించాడు మహేశ్, ఆ తర్వాత అతడి సినిమాల్లో రొమాన్స్ పాళ్లు తగ్గుతూ వచ్చింది. ‘బ్రహ్మోత్సవం” సినిమాతో ఆ లోటు పూడుస్తున్నారేమో!
