Friday, May 17, 2024
- Advertisement -

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ టైం న‌డుస్తుంది : మ‌హేశ్ బాబు

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ద‌శా,దిశా మార్చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. ఈ సినిమా త‌రువాత తెలుగు సినిమాల‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.ఇక అర్జున్ రెడ్డి వంటి పాత్ బ్రేకింగ్ మూవీ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో హిట్ కొట్ట‌డానికి చాలా టైం ప‌డుతుంద‌ని చాలా మంది భావించారు.కాని అర్జున్ రెడ్డి వెంట‌నే గీతా గోవిందంతో మ‌రో హిట్ కొట్టాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.ఈ సినిమాను టాలీవుడ్ స్టార్స్ అంద‌రు మెచ్చుకున్నసంగ‌తి తెలిసిందే.మహేష్‌ ‘గీత గోవిందం’ను చూసి మెచ్చుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు విజయ్‌ దేవరకొండపై ఓ ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు.మ‌హేశ్ ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.షూటింగ్ స్పాట్‌కి వెళ్లి మ‌రి మ‌హేశ్‌ను క‌లిశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.మహేష్‌ను కలిసిన ఆనందంతో విజయ్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అయింది.ఈ ట్వీట్‌కు మహేష్‌ రిప్లై ఇస్తూ..ఇది విజయ్‌ దేవరకొండకు మంచి సమయమని.. ఇప్పుడు అతని టైమ్‌ నడుస్తోందంటూ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే హాలిడేను ఎంజాయ్‌ చేయమంటూ విజయ్‌కు విషెస్‌ తెలిపాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -