- Advertisement -

జ‌గ‌న్ దెబ్బ‌కు రూటు మార్చుకుంటున్న బాబు.

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు వ‌స్తున్న అపూర్వ ప్ర‌జాస్పంద‌న‌ను చూసి చంద్ర‌బాబు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల‌నుంచి భారీ స్పంద‌న వ‌స్తుండ‌టంతో అధికార‌పార్టీటీడీపీ, కాంగ్రెస్ ప్ర‌ముఖ‌ నేత‌లు వైసీపీలోకి క్యూక‌డుతున్నారు. దీంతో బాబుకు కంటిమీద కునుకులేకునుకు క‌రువ‌య్యింది. దీంతో బాబు త‌న రూటును మార్చుకున్నారు. ఇత‌ర పార్టీల‌నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు వెల్ల‌కుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకీ చెందిన ప్ర‌ముఖ నేత‌లు వైసీపీలో చేర‌కుండా బాబు త‌న కుటిల ప్ర‌య‌త్నాల‌ను మొద‌లు పెట్టారు. నా పార్టీలో చేర‌కున్నా ప‌ర్వాలేదు కాని ప్ర‌తిప‌క్ష పార్టీలోకి వెల్ల‌కుండా త‌న మార్క్‌ను చూపెట్టారు బాబు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్‌లో మిగిలిన కొద్దోగొప్పో నేతలు కూడా వేరే పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

వీళ్లు జ‌గ‌న్ పార్టీలోకి వెలితే ఎక్క‌డ పార్టీ బ‌ల‌ప‌డుతుందోన‌ని బాబు వారు పార్టీల్లోకి వెల్ల‌కుండా సంప్ర‌దింపులు జ‌రిపి స‌క్సెస్ అయ్యారు. చంద్రబాబును గత నాలుగేళ్లలో శైలజనాథ్ తీవ్రంగా విమర్శిస్తూ వచ్చాడు. పత్రికలకు వ్యాసాలు కూడా రాశాడు. కానీ ఇప్పుడు మాత్రం జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్నారు. జ‌గ‌న్ ఇస్తున్న హామీల‌కు బ‌డ్జెట్ స‌రిపోద‌ని ఈయ‌న చెబుతున్నారు. మొన్న ఈయనకు చంద్రబాబుతో ‘పని’పడింది. ఆ సమావేశం తర్వాత శైలజనాథ్ తెలుగుదేశంలోకి చేరేస్తున్నాడు అని వార్తలు వచ్చినా, అదేం జరగలేదు.

శైల‌జానాథ్ బాట‌లోనే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కూడా ప‌య‌నిస్తున్నారు. ఈయ‌న కూడా బాబుతో భేటీ అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌నుంచి పోటీ చేసిన ఉగ్ర‌న‌ర‌శింహారెడ్డి ఓట్ల‌ను చీల్చి టీడీపీకీ లాభం క‌లిగించేలా చేశారు. నరసింహారెడ్డికి వచ్చిన ఓట్లతో పోలిస్తే టీడీపీకి వచ్చిన మెజారిటీ కొంచెం ఎక్కువే అయినా.. రేపటి ఎన్నికల సమయంలో ఇలాంటి వాళ్లు పోటీలో ఉండటం వల్ల ఓట్ల చీలికకు అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు లెక్కలేస్తున్నారు.

న‌ర‌శింహారెడ్డి పార్టీలోకి రావ‌డం వ‌ల్ల లాభంలేద‌ని బాబుఇలాంటి వాళ్లను కాంగ్రెస్ తరఫునే స్టాండర్డ్ గా నిలపాలని బాబు భావిస్తున్నట్టుగా ఉన్నాడు. మొన్నేమో శైలజనాథ్‌తో ‘వ్యక్తిగత’ సమావేశాన్ని నిర్వహించిన బాబు …ఇప్పుడు ఉగ్ర‌న‌ర‌శింహారెడ్డితో భేటీ అయ్యారు. వీరిని చంద్రబాబు నాయుడు పిలిపించుకుని ‘భరోసా’ ఇస్తున్నాడంట చంద్ర‌బాబు. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా.. ఇలాంటి వాళ్లకు వీలైనంత ‘సహకారం’ ఇవ్వడం ద్వారా ఓట్లను చీల్చడానికి వ్యూహాన్ని పన్నుతున్నారని స్పష్టం అవుతోంది.

ఎన్నిక‌ల స‌మ‌యానికి శైలజనాథ్, ఉగ్రనరసింహారెడ్డి లాంటి వాళ్లు వైసీపీలోకి వెల్లొచ్చు. అదే జ‌రిగితే జ‌గ‌న్ బ‌ల‌ప‌డ‌తార‌ని ఆలోపే అల‌ర్ట్ అయిన చంద్రబాబు నాయుడు ఓట్ల చీలిక రాజకీయాన్ని అమలు పెడుతున్నట్టుగా ఉన్నాడు. జ‌గ‌న్ దెబ్బ‌కు బాబు రూటు మార్చార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -