Tuesday, April 30, 2024
- Advertisement -

అవి సినిమా వాళ్లు పుట్టించిన పుకార్లే : స‌మంత‌

- Advertisement -

అక్కినేని ఇంటి కోడ‌లు అయిన ద‌గ్గ‌ర నుంచి హీరోయిన్ స‌మంతలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.గ్లామ‌ర్ పాత్ర‌లు మానేసిన స‌మంత క‌థ బ‌లం ఉన్న సినిమాలే చేస్తుంది. పెళ్లి త‌రువాత ఆమె న‌టించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్లుగా నిలిచాయి.దీంతో పెళ్లి త‌రువాత హీరోయిన్లు సినిమాలకు ప‌నికిరారు అని అపోహను తొల‌గించారు స‌మంత.దీనిపై స‌మంత స్పందిస్తు….పదేళ్లుగా కథానాయకిగా నటించడాన్ని సాధారణంగానే భావిస్తున్న సమంత దీని గురించి ఏం చెబుతుందో చూద్దాం. 10 ఏళ్లుగా కథానాయకిగా రాణించడానికి పెద్దగా భావిస్తున్నారు.

వివాహంతో హీరోయిన్ల మార్కెట్‌ పడిపోతుందనే ఒక అపోహ ఉంది. దాన్ని బ్రేక్‌ చేయాలని భావించాను. అనుకున్నట్టుగానే బ్రేక్‌ చేశాను.వివాహానంతరం నేను నటించిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. అదేవిధంగా పెళ్లి అనంతరం హీరోయిన్లకు ఆదరణ ఉండదనే ప్రచారం సినిమా వాళ్లు చేసిందే. సమంత తాజాగా నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం యూటర్న్, శివకార్తికేయన్‌కు జంటగా నటించిన సీమదురై షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెల ఒక వారం గ్యాప్‌లో వరుసగా తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -