Thursday, May 2, 2024
- Advertisement -

మ‌రో ఘాతుకానికి పాల్ప‌డిన న‌క్స‌ల్స్‌…

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. వరుస దాడులకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా ఎన్నికల ఏర్పాట్ల కోసం వచ్చిన ఓ బస్సును IED బాంబుతో పేల్చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులతో పాటూ ఓ సీఐఎస్‌ఎఫ్‌ జవాను మృతిచెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడదలైన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో ఇది మూడో మావోయిస్టు దాడి. అక్టోబరు 30న దంతెవాడలోని అరన్‌పూర్‌లో పెట్రోలింగ్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, దూరదర్శన్ కెమెరామెన్ చనిపోయారు. అంతకుముందు అక్టోబర్ 27న బీజాపూర్ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు వెళ్తున్న వాహ‌నాన్ని మావోయిస్టులు పేల్చేశారు. ఆ ఘ‌ట‌న‌లో న‌లుగురు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే.

మార్కెట్‌లో వ‌స్తువులు కొనుగోలు చేసి తిరిగి క్యాంపుకు ప‌య‌న‌మైన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. తొలిద‌శ ఎన్నిక‌ల కోసం సీఐఎస్ఎఫ్ బ‌ల‌గాలు భ‌ద్ర‌త ఏర్పాటు చేశాయి. న‌వంబ‌ర్ 20వ తేదీన రెండ‌వ ద‌శ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -