Monday, May 6, 2024
- Advertisement -

మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’ టీజర్ డేట్..

- Advertisement -

మహేశ్ బాబు, కైరా అద్వాని, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న కొత్త సినిమా టీజర్ కోసం ప్రిన్స్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ‘భరత్ అనే నేను’ సినీ బృందం నుంచి వారికి ఓ శుభవార్త అందింది. ‘ది విజన్ అఫ్ భరత్’ పేరుతో మార్చి 6న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు టీజర్లు పాటలతో హంగామా చేస్తుండగా.. ఇప్పటివరకూ మహేష్ మూవీకి చిన్నపాటి టీజర్ కూడా ఇవ్వలేదు. ఒకట్రెండు పోస్టర్లు.. ఒకసారి వాయిస్ వినే భాగ్యం మాత్రమే ఫ్యాన్స్ కి దక్కింది. అభిమానుల ఆతృతను హీరోతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా క్యాచ్ చేశాడు. అందుకే భరత్ అనే నేను మూవీకి పబ్లిసిటీ యాక్టివిటీస్ స్టార్ట్ చేసేయాలని డిసైడ్ అయ్యారు. మార్చ్ 6న విజన్ విడుదల చేస్తామంటూ అధికారికంగా ప్రకటించాడు దర్శకుడు.

లక్షలాది జనసందోహాన్ని బ్యాక్ గ్రౌండ్ లో ఉంచి.. మధ్యలో కారులో మహేష్ బాబు ఉన్న పోస్టర్ తో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే.. ఇంతకీ విజన్ అంటే ఏం ఇస్తారు అన్న డౌట్ అభిమానుల్లో ఉంది. ఇప్పుడు ఎలాగూ రకరకాల పేర్లతో హంగామా చేయడం మేకర్స్ కు పరిపాటి అయింది కాబట్టి.. టీజర్ కే ఈ పేరు పెట్టి.. ఏదో చూపించబోతున్నారు అనుకుంటున్నారు. అంటే భరత్ అనే నేనుకు మార్చ్ 6న టీజర్ వస్తుందనే ఎక్స్ పెక్టేషన్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

స్పైడర్’ సినిమాతో నిరాశ పరచిన మహేశ్ బాబు.. ‘భరత్ అనే నేను’ చిత్రంతో హిట్ కొడతాడని అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -