Wednesday, May 15, 2024
- Advertisement -

చంద్రుడిపై 4Gనెట్‌వ‌ర్క్‌ను ఏర్పాటు చేయ‌నున్న వొడాఫోన్ ….

- Advertisement -

చంద్రుడిమీద ప్ర‌ముఖ బ్రిటీష్ టెలికం సంస్థ వోడాఫోన్ 4జీ నెట్‌వ‌ర్క్‌ను ఏర్పాటు చేయ‌నుంది. అదేంటి చంద్ర‌మండ‌లంమీద నెట్ వ‌ర్క్ ఏంటి అనుకుంటున్నారా…? మీరు వింటున్న‌ది నిజ‌మే. టెక్నాల‌జీ రోజురోజుకీ వ‌స్తున్న మార్పుల‌తో ఏదైనా సాధ్యం చేయ‌వ‌చ్చు.

చంద్రుడి మీద 4జీ నెట్‌వర్క్ ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా జ‌రుగుతున్నాయి. ఈ మేరకు నోకియా, ఆడి సంస్థలు వొడాఫోన్‌తో చేతులు కలిపాయి. 2019లో పీటీ సైంటిస్టులు చేపట్టనున్న మిషన్‌కు సపోర్ట్‌గా చంద్రుడిపై తొలి 4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వొడాఫోన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ‘నోకియా’ను టెక్నాలజీ పార్టనర్‌‌గా ఎంపిక చేశారు.

పీటీ సైంటిస్ట్స్ వ్యవస్థాపకుడు, సీఈవో రోబర్ట్ బహ్మే మాట్లాడుతూ.. ‘‘ప్రైవేట్ ఫండింగ్‌తో తలపెడుతోన్న తొలి మూన్ ల్యాండింగ్ మిషన్ ఇది. ఈ ప్రయోగం అంతరిక్ష పరిశోధనల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. స్పేస్ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా 2019లో చంద్రయానం చేపట్టనున్నాం. ఈ సందర్భంగా అక్కడి పరిశోధనల వివరాలను ఎప్పటికప్పుడు స్పష్టమైన చిత్రాలతో అందించేందుకు ఈ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నాం’’ అని తెలిపారు.

వొడాఫోన్ చంద్రుడిపై ఏర్పాటు చేసే నెట్‌వర్క్ ద్వారా 1800MHz ఫ్రీక్వెన్సీ కలిగిన 4G సేవలు లభిస్తాయి. దీని ద్వారా చంద్రుడిపై చిత్రించే HD వీడియోలు బెర్లిన్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్‌కు అందిస్తారు. ఈ 4G నెట్‌వర్క్‌ను చంద్రుడి మీద వినియోగించే రెండు ఆడీ లూనార్ క్వట్ట్రో రోవర్లకు అనుసంధిస్తారు. చంద్రుడి మీద తీసే చిత్రాలను వెంటనే భూమి మీద ఉండే అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపేందుకు 4జీ నెట్ వర్క్ ఉపయోగపడుతుంది. ఇక త్వ‌ర‌లోనే సామాన్యులు కూడా చంద్ర‌మండ‌లంమీద‌కు వెల్ల వ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -