- Advertisement -

మహేశ్ ‘బ్రహ్మోత్సవం” కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తోంది

- Advertisement -

మహేశ్ బాబు హీరోగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న బ్రహ్మోత్సవం సినిమా బడ్జెట్ విషయంలో కొత్త పుంతలు తొక్కుతోంది.

కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ బడ్జెట్టే ఒక రేంజ్ కు దూసుకెళ్లింది. తొలి షెడ్యూల్ ముగిసిన తర్వాత లెక్కగడితే ఈ సినిమాకు ఇప్పటికే పదమూడు కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా విషయంలో భారీగా ఖర్చుపెట్టిస్తున్నాడని… ఎక్కడా తగ్గకుండా చూసుకొంటున్నాడని సమాచారం. దీంతో బడ్జెట్ అమాంతం పెరిగిపోతోంది.

మరి తొలి షెడ్యూల్ లోనే ఇంత ఖర్చుపెట్టడం విశేషమే. మామూలుగా అయితే ఈ బడ్జెట్ తో ఒక యావరేజ్ సినిమా పూర్తి అవుతుంది. ఇంత ఖర్చుతో సినిమాను విడుదలే చేసుకోవచ్చు. అయితే మహేశ్ సినిమా విషయంలో ఇలా బడ్జెట్ పైపై కి పోతోంది. మరి ఓవరాల్ గాపూర్తయ్యే సరికి మొత్తం బడ్జెట్ ఎక్కడికి చేరుతుంది? అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. మరి కేవలం ఖర్ఛు విషయంలోనే కాదు.. మహేశ్ సినిమా బిజినెస్ కు కూడా లోటు ఉండకపోవచ్చని సమాచారం. ఎందుకంటే.. మహేశ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. దీంతో ‘బ్రహ్మోత్సవం’ భారీ బిజినెస్ చేసే అవకాశాలున్నాయి.

ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ దాదాపు పదహారు కోట్ల రూపాయలు పలుకుతున్నాయని సమాచారం. ‘శ్రీమంతుడు’ సినిమా ఓవర్సీస్ లో దాదాపు 19 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. దీంతో.. ఈసారి మహేశ్ సినిమా విడుదల హక్కులు అక్కడ కొత్త రికార్డులకు చేరువవుతన్నాయి. మరి ఈ సినిమా ఇకపై ఇంకా ఎన్నెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -