Thursday, May 16, 2024
- Advertisement -

శ్రీమంతుడు సినిమాని మహేశ్‌ కూడా వదిలేసి ఉంటే..!?

- Advertisement -

మహేశ్‌బాబు శ్రీమంతుడు సినిమా తెలుగులోబ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. గత రెండు సంవత్సరాల నుంచి టాలివుడ్‌లో అత్తారింతికి దారేది సినిమా రికార్డ్స్ఉండేవి.

ఆ రికార్డ్స్ మొన్న బాహుబలి టాలివుడ్‌లోనే కాక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. 

అయితే తాజాగా వచ్చిన మహేశ్‌బాబు శ్రీమంతుడు సినిమా బాహుబలి రికార్డ్స్‌ని బ్రేక్ చేయలేకపోయినా టాలివుడ్‌లో మాత్రం అత్తారింటికి దారేది మూవీ రికార్డ్‌ని బ్రేక్ చేసి సెకండ్ ప్లేస్‌ని కొట్టేసింది. ఇదిలా ఉండగా మహేశ్ చేసిన శ్రీమంతుడు మూవీ మొదటగా చరణ్ విని, బాగుంది అని చెప్పి షూటింగ్ వరకు వెళ్ళకుండా నాన్చుతూ వచ్చాడట. దీంతో నిర్మాతలకు అర్థం కాక స్టాప్ చేశారట. 

మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఎన్‌టిఆర్‌కు కూడా వినిపించారట. ఎన్‌టిఆర్‌ కూడా కథ విని చాలా బాగుంది, చేద్దాం చేద్దాం అంటూ ఈయన కూడా నాన్చుతూ వచ్చాడట. అలా అక్కడ ఇక్కడ తిరిగి చివరికి మహేశ్‌బాబు చెంతకు చేరింది. మహేశ్‌బాబు కూడా మొదట్లో నాన్చారట కానీ మళ్ళీ ఒకే చెప్పటంతో సెట్స్ మీదకు వెళ్ళి  చివరికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. 

ఈ విషయంలో మహేశ్‌బాబు మంచి ఛాన్స్ కొట్టాడు. గత రెండు సంవత్సరాల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న మహేశ్ కి బ్లాక్ బస్టర్ ఇలా వచ్చిందన్నమాట.     

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -