Monday, May 6, 2024
- Advertisement -

రీషూట్ సీన్ లలో పాల్గొంటున్నాడు మహేష్!

- Advertisement -

బ్రహ్మోత్సవం సినిమా విడుదల తేదీ ఈ నెల 20 అని మహేష్ బాబు స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అధికారిక ప్రకటన మహేష్ అంతట మహేష్ చేసిన తరవాత మరి సినిమా విడుదల ఆలస్యం అయితే ఇంకేమన్నా ఉందా? అందుకే మహేష్ తో పాటు మొత్తం టీం అంతా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో యమా బిజీ గా ఉన్నారు.

మహేష్ ఇప్పటికే డబ్బింగ్ పూర్తి చేయగా ప్రమోషన్ టీం ప్రమోషన్ లకి చాలా ప్లాన్ లు వేస్తోంది. ఇప్పటికే అడియో, పోస్టర్స్, ట్రైలర్‌తో తారాస్థాయిలో ఉన్న అంచనాల మధ్యన సినిమాను అనుకున్న తేదీకల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీం అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ఆధ్వర్యంలో డబ్బింగ్‌తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సమాంతరంగా సాగుతున్నాయి.

మహేష్ బాబు నిద్ర కూడా మానుకుని కొన్ని రీషూట్ సీన్ లలో పాల్గొంటున్నాడు అని చెబుతున్నారు. ఏదేమైనా మహేష్ ఇంతగా డెడికేషన్ చూపిస్తూ ఉండడం తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఫాన్స్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -