Friday, May 10, 2024
- Advertisement -

ఓవర్సీస్ మార్కెట్ లో మహేశ్ ‘శ్రీమంతుడు’ కొత్త రికార్డ్!

- Advertisement -

ప్రిన్స్ మహేశ్ బాబు స్టామినా ఏమిటో మరోసారి అందరికీ అర్థం అవుతోంది. టాలీవుడ్ లోని టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్నా.. మిగతా వారికన్నా తను ఏ విధంగా  ప్రత్యేకమో మహేశ్ బాబు మరోసారి నిరూపించుకొన్నాడు.

మహేశ్ బాబు తాజా సినిమా ‘శ్రీమంతుడు” ఓవర్సీస్ మార్కెట్ ను బట్టి ఆయనకు ఉన్న క్రేజ్ ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాతో మహేశ్ ఓవర్సీస్ మార్కెట్ లో కొత్త రికార్డు సృష్టించాడు. ఏకంగా 8.1 కోట్ల రూపాయలు పలికాయట శ్రీమంతుడు ఓవర్సీస్ హక్కుల ధరలు. ఇది టాలీవుడ్ వరకూ సరికొత్త రికార్డు. మరే ప్రాంతీయ భాషల సినిమాలు కూడా ఈ స్థాయిలో మార్కెట్ చేయలేదు.  ఈ విధంగా మహేశ్ బాబు కొత్త రికార్డు సృష్టించాడు.

మహేశ్ బాబు ఇంతకు ముందు సినిమాలు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ “వన్” లు కూడా విదేశాల్లో మంచి కలెక్షన్లను సాధించాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా సినిమా భారీ ధరకు అమ్ముడు పోయినట్టుగా తెలుస్తోంది. మరి డిస్ట్రిబ్యూషన్ రైట్సే ఈ స్థాయిలో పలికాయంటే.. ఈ సినిమా అక్కడ ఏ స్థాయి కలెక్షన్లను సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలైలో విడుదల కానుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -