Friday, May 17, 2024
- Advertisement -

టీడీపీ మోడీకి అనుకూలంగా.. వైకాపా వ్యతిరేకంగా!

- Advertisement -

ఆంధ్రప్రధేశ్ చెందిన రెండు ప్రాంతీయ పార్టీలూ ఇన్ని రోజులూ  కేంద్రంలోని మోడీ సర్కారుకు అనుకూలమే అనే పేరును తెచ్చుకొన్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా.. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీ మోడీ సర్కారులో భాగస్వామి అయ్యింది. మోడీ మంత్రివర్గంలో తెలుగుదేశం ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. ఇక ఏపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. 

ఇక వైకాపా విషయానికి వస్తే.. ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం కూటమిని ఎదుర్కొన్నా.. ఎన్డీయేకి వ్యతిరేకి అని ప్రకటించుకోలేదు. ఎన్నికల తర్వాత వైకాపా అధినేత జగన్ ప్రధానమంత్రి మోడీని కలిశాడు. అంశాల వారీగా ఎన్డీయేకు మద్దతు అంటూ.. కేంద్రంలోని అధికార పార్టీకి దగ్గరగా ఉండేందుకే ప్రయత్నించాడు.

మరి ఇప్పుడు కేంద్రంలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. మోడీప్రభుత్వం ప్రతిపాదించిన భూ సమీకరణ చట్టంలో సవరణలను వ్యతిరేకించే వాళ్లు, ఈ సవరణల బిల్లుకు మద్దతు పలికే వారు.. అంటూ రెండు గ్రూపులుగా తయారయ్యారు. ఈ బిల్లు కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని.. ఇది రైతు వ్యతిరేక బిల్లు అంటూ.. అనే పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. ఇలాంటిపార్టీల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా ఉండటం విశేషం!

బీజేపీకి దగ్గరి పార్టీ అయిన శివసేన, శిరోమణి అకాళీదల్ వంటి పార్టీలు భూ సమీకరణ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో తాము మోడీ సర్కారుకు అనుకూలంగా నిలిచేది ఉండదని.. ఎన్డీయేలోని ఆ పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. 

మోడీది రైతు వ్యతిరేక విధానం అని అవి స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మోడీ  ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలుకుతోంది. ఈ విధంగా బీజేపీకి గొప్ప ప్రాధాన్యత ఇస్తోంది. ఇక అంశాల వారీగా మోడీకి మద్దతు అని ప్రకటించిన వైకాపా మాత్రం ఇప్పుడు తాము కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించింది.  రైతు వ్యతిరేక విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. మొత్తానికి ఇలా ఉన్నాయి.. ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీ విధానాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -