Monday, May 6, 2024
- Advertisement -

మహేష్ తగ్గుతాడా ? పవన్ తగ్గుతాడా ? సమ్మర్ బరిలో ఎవరు ముందు ?

- Advertisement -

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వీరిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ స్టార్స్ కానీ ఎప్పుడూ ఒకరితో ఒకరు పోటీ గా సినిమాలు విడుదల చేస్కోలేదు. ఎప్పుడో బంగారం – పోకిరీ కలిసి విడుదల అయ్యాయి కానీ అప్పుడు సీజన్ లెక్కే వేరు.

ఈ మధ్య కాలం లో ఒక పదేళ్ళు గా ఈ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు కానీ రాబోతున్న సమ్మర్ లో పవన్ వర్సెస్ మహేష్ ఉండి తీరుతుంది అని భోగట్టా. సర్దార్ గబ్బర్ సింగ్ ని పవన్ కళ్యాణ్ ఏప్రిల్ ఎనిమిది న విడుదల చెయ్యడం కోసం సన్నాహాలు చేస్తూ ఉండగా మరొక పక్క మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా ని అదే టైం కి తీసుకుని వస్తున్నాడు అని తెలుస్తోంది. ఈ మధ్య కాలం లో అసలే విడుదల తేదీల విషయంలో విపరీతమైన క్లాష్ లు ఎదురుకొంటున్న్నారు నిర్మాతలు ఇలాంటప్పుడు మహేష్ – పవన్ లాంటి భారీ స్టార్ లు తలపడడం అంటే మాటలు కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రొడ్యూసర్ అవుట్ అవుతాడు. ముందు థియేటర్ ల కొరత ఏర్పడుతుంది. అనధికారికంగా సర్దార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ ఎనిమిది న అంటున్నారు మరొక పక్క బ్రహ్మోత్సవం కూడా ఏప్రిల్ తొమ్మిది పది తారీఖులలో విడుదల కి చూస్తున్నాడు మహేష్ సో ఈ సారి తలపడే చాన్స్ అయితే ఉంది కానీ తలపడరు అని చెప్పచ్చు, ఎందుకంటే ప్రొడ్యూసర్ ల సేఫ్టీ చూసే హీరోలో ఇద్దరూ కూడా సో ఇబ్బందేమీ లేదు కానీ ముందు ఎవరు తలొగ్గి డేట్ మారుస్తారు అనేది క్యూస్షన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -