Friday, May 3, 2024
- Advertisement -

ఆ ఒక్క హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నా – మహేష్ బాబు

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలోంచి హీరోగా ఎదుగుతున్న సుదీర్ బాబు అంటే ప్రిన్స్ మహేష్ కి ఎప్పుడూ మక్కువ ఎక్కువే, ఆయన సినిమా లు అన్నింటికీ తనదైన సపోర్ట్ ఇస్తూ ఉంటారు మహేష్ బాబు. ఈ మధ్య వచ్చిన సుదీర్ సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం అందుకోలేన చతికిల పడింది.

అయినా ఎప్పుడూ కమర్షియల్ పంథా లోకి రాకుండా డిఫరెంట్ సినిమాలు ఎంచుకునే సుదీర్ ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తున్నాడు. భలే మంచి రోజు అనే తన కొత్త సినిమా ఆడియో ని బావ మహేష్ చేతుల మీదగా విడుదల చేయించిన సుధీర్ మహేష్ ఇచ్చిన సపోర్ట్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. “సుధీర్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ సినిమా కోసం కష్టపడుతూ, డెడికేషన్‌తో పనిచేస్తుంటాడు. కష్టపడే తత్వమున్న సుధీర్‌ను హీరోగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్. భలే మంచి రోజు టీజర్ చూసినప్పుడే ఫ్రెష్‌గా కనిపించింది. ఇప్పుడు ఆడియో, ట్రైలర్ చూశాక మరింత కొత్తదనం కనిపించింది. ఒక్క సరైన హిట్ కొడితే సుదీర్ స్టార్ హీరో అయిపోతాడు,  ఆ హిట్ కోసం అతనితో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నాం ” అంటూ చెప్పుకొచ్చాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -