Sunday, May 5, 2024
- Advertisement -

అఖిల్ లాస్ కి నాలుగు కోట్లు ఇచ్చి ఆదుకుంటాను అని చెబుతున్న వినాయక్

- Advertisement -

అఖిల్ సినిమా కష్టాలు ఇప్పట్లో తేలేలా కనిపించట్లేదు. అక్కినేని వంశం లో కొత్త వారసుడి అరంగేట్రం అంటూ చాలా హడావిడి చేసి చివరకి ఒకే పేలవమైన సినిమాని వినాయక్ నాగార్జున చేతిలో పెట్టాడు. ఈ సినిమా విడుదల రోజు నుంచే మిక్స్డ్ టాక్ తో దారుణంగా కలక్షన్లలో వెనక పడింది .

మొదటి రోజు సినిమాకి వచ్చిన హైప్ వలన మంచి ఓపెనింగ్స్ ఒచ్చినా కూడాతరవాత తరవాత డీలా పడిపోయిన డిస్ట్రిబ్యూటర్ లు బ్రేక్ ఈవెన్ కాదు కదా విపరీతమైన లాస్ లలో మునిగిపోయారు. నితిన్ , నాగార్జున లతో పాటు ఎవరికి వారు తమకి తోచినట్టుగా సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంతటి విపరీత పరిస్థితి కనిపించింది.

ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ లని ఆదుకునే పనిలో పడ్డారట డైరెక్టర్ వినాయక్. అంత పెద్ద లాస్ కి తన వంతు సాయంగా కోటి రూపాయలు ఇస్తున్నారు ఆయన.కృష్ణ డిస్ట్రిక్ట్ లో కొందరు డిస్ట్రిబ్యూటర్ లు బాగా దెబ్బ తిని ఉండగా వారికి వినాయక్ ఈ విధమైన ఆర్ధిక సయం అందిచబోతున్నారు అని తెలుస్తోంది. దీంతో పాటు మూడు కోట్లు తన పారితోషికాన్ని ప్రొడ్యూసర్ కి వెనక్కి ఇవ్వబోతున్నారట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -