Monday, May 13, 2024
- Advertisement -

మహేష్‌తో పెళ్ళికి ముందు నమ్రతా లైఫ్…… సంచలన ఆరోపణలు చేసిన మలైకా అరోరా

- Advertisement -

ఇప్పటి నమ్రతా శిరోద్కర్ గురించి తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. సూపర్ స్టార్ మహేష్ భార్యగా, మంచి గృహిణిగా చాలా మంది నుంచి ప్రశంశలు అందుకుంటున్నారు నమ్రతా శిరోద్కర్. అయితే డబ్బుల దగ్గర మాత్రం అస్సలు కాంప్రమైజ్ కారని ఇండస్ట్రీలో మహేష్‌తో సినిమాలు చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే మహేష్ భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా మాత్రం నమ్రతాకు వందకు వంద మార్కులు వేస్తూ ఉంటారు చాలా మంది. మరి మహేష్‌తో పెళ్ళికి ముందు నమ్రతా ఎలా ఉండే వారు? తన ప్రవర్తన ఎలా ఉండేది?

ఈ విషయాలపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖాన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వంశీ సినిమాతో పాటు చిరంజీవితో కలిసి అంజి సినిమాలో యాక్ట్ చేసినప్పటికీ నమ్రతా బిహేవియర్ గురించి మాత్రం ఎప్పుడూ విమర్శలు రాలేదు. అయితే నమ్రతా శిరోద్కర్ చాలా పెద్ద గర్విష్టి అని ఇప్పుడు మలైకా ఆరోపిస్తోంది. మోడల్‌గా మలైకా కెరీర్ ప్రారంభంలో ఉన్న సమయానికి నమ్రతా శిరోద్కర్ టాప్‌లో ఉన్నారట. ఆ టైంలోనే మలైకాతో నమ్రతా శిరోద్కర్ చాలా దురుసుగా ప్రవర్తించిందట. గర్వం చూపించదట. ఈ విషయాలను మరో నటి నేహేధూపియా నిర్విహిస్తున్న షోలో పాల్గొన్న సమయంలో చెప్పుకొచ్చింది మలైకా. అయితే ఈ స్థాయిలో ఆరోపణలు చేసిన మలైకా ఆ తర్వాత మాత్రం నమ్రతా ఇప్పుడు తనకు స్నేహితురాలేనని చెప్పుకొచ్చింది. కాకాపోతే కెరీర్ ప్రారంభంలో మాత్రం దురుసుగా, గర్వంతో ప్రవర్తించి ఇబ్బంది పెట్టిందని వాపోయింది మలైకా అరోరా ఖాన్. నమ్రతా శిరోద్కర్ కొన్ని విషయాల్లో ఎంత కఠినంగా ఉంటుందో మన తెలుగు సినిమా నిర్మాతలకు బాగానే తెలుసు. ఇప్పుడు మలైకా మాటల పుణ్యమాని మోడల్‌గా ఉన్నప్పటి నమ్రతా గురించి కూడా తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -