డ్రగ్స్ కేసు తెలుగు ఇండస్ట్రీని అతలకుతలం చేసిన సంగతి తెలిసిందే.చాలా మంది సినీ సెలబ్రిటీలు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని తమ జీవితాలను నాశనం చేసుకున్నారు.ఈ వివాదం కాస్తా సర్దుమణిగింది అనుకున్న సమయంలో..మరో హీరోయిన్ పేరు ఈ కేసులో బయటికి వచ్చింది.పూర్తి వివారాల్లోకి వెళ్తే..మలయాళ టీవీ-సినీ నటి అశ్వతి బాబు డ్రగ్స్‌ను సప్లయి చేస్తు తో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయింది.తన కారు డ్రైవర్‌తో కలిసి ప్రమాదకర ఎండిఎంఏ డ్రగ్స్‌ని కస్టమర్‌కి అందించడానికి ఎదురు చూస్తున్నఅశ్వతి బాబుని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.గత కొంతకాలంగా ఆమె డ్రగ్స్ సప్లయి చేస్తుందట.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మఫ్టీలో వెళ్లి మరి ఆమెను అరెస్ట్ చేశారు.అశ్వతి తన ఇంటి పరిసరాల్లోనే తచ్చాడుతూ కనిపించింది. అప్పటికే అక్కడ కాపు కాసిన పోలీసులు ఆమెను తమ అదుపులోకి తీసుకున్నారు.. ప్రస్తుతం ఈ కేసు విషయంపై ఆమెను విచారిస్తున్నారు.ఎవరి ద్వారా ఆమె డ్రగ్స్ సప్లయి చేస్తుందో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.ఈ వ్యవహారంలో ఇండస్ట్రీని చాలామంది పేర్లు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.అశ్వతి బాబు డ్రగ్స్ సప్లయి చేస్తు దొరికిపోవడంపై ఆమె బంధువులు,స్నేహితులు షాక్ అవుతున్నారు.
- 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక
- ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!