మరో రీమెక్ కు రెడీ.. తగ్గేదేలే అంటున్న వెంకీ మామ

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేశ్ భిన్నమైన హీరో. మిగతా హీరోల్లా కాకుండా తన కంటూ ప్రత్యేక పంథాను ఆయన ఏర్పరచుకున్నారు. మంచి కథలను ఎంచుకుంటూ మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ భిన్నంగా ముందుకు సాగుతున్నాడు వెంకీమామ.

గతేడాది వెంకటేష్ ‘నారప్ప’,‘దృశ్యం 2’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండు చిత్రాలు కూడా వేరే భాషలో హిట్ అయిన సినిమాలు కావడం విశేషం. ఈ సారి మలయాళంలో ఘన విజయం సాధించిన సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

తాజాగా వెంకటేష్ మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. సినిమా హక్కుల కోసం నిర్మాత సురేష్ బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టాక్. ఈ మధ్యే ఓటీటీలో విడుదలై మంచి విజయం అందుకుంది. బ్రో డాడీలో రానాతో కలిసి వెంకీ నటించనున్నారు.

ఆ ఒక్క సినిమాతో మారిపోయిన త‌ల‌రాత‌

మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్ గా కంగ‌న

మాస్టర్ హీరోయిన్‌ పంట పండింది

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -