Sunday, May 5, 2024
- Advertisement -

టాలివుడ్ సినిమాకి సంత‌కం చేసిన ప్రియావారియ‌ర్‌..?

- Advertisement -

సినిమారంగంలో స్టార్‌లు కావాలంటే అంత‌తేలికైన విష‌యం కాదు. ఎన్నో ఆటుపోట్లును ఎదుర్కొని మంచి హిట్ సినిమాల‌తో సెల‌బ్ర‌టీలుగా రాణిస్తుంటారు. అదృష్టం ఉంటే రాత్రికిరాత్రే సెల‌బ్ర‌టీలు అయిపోవ‌చ్చు. ఒక్క‌సినిమా విడుద‌ల కాకుండానే రాత్రికి రాత్రే సెల‌బ్ర‌టీ అయ్యింది మ‌ల‌యాళ‌న‌టి ప్రియాప్ర‌కాశ్ వారియ‌ర్‌.

కేవలం అందమైన కనుసైగలతో దేశంలోని యువకుల హృదయాలను కొల్లగొట్టింది వర్ధమాన మలయాళ నటి ప్రియ ప్రకాశ్ వారియర్. టాలీవుడ్‌లో న‌టించేంద‌కు సంత‌కం చేసింద‌నే వార్త‌లు వ‌నిపిస్తున్నాయి. మలయాళంలో ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమాతో ప్రియ ప్రకాశ్ వారియర్ వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవై ’ పాటలో ఆమె ప్రదర్శించిన హావభావాలకు ఫిదా అయిన పలువురు దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తీయబోయే తదుపరి సినిమాలో ప్రియకు అవకాశం ఇవ్వాలని అనుకున్నారట. కానీ, కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద బ్యానర్లు కూడా ఆమెతో కలిసి పని చేయాలని భావిస్తుండగా, మరోపక్క టాలీవుడ్‌ లో పేరున్న ఓ నిర్మాణ సంస్థ నిర్మించనున్న తదుపరి సినిమాకు ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా సంతకం చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -