Friday, May 10, 2024
- Advertisement -

వర్మకు ఘాటుగా సమాధానం ఇచ్చిన సల్మాన్!

- Advertisement -

‘ఓకే బంగారం’ సినిమాను చూసి.. అది తెగనచ్చేసింది అంటూ.. అందులోని హీరో దుల్కర్ సల్మాన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

మరి పొగడటంలోనైనా.. విమర్శించడంలోనైనా.. తన మార్కును చూపే వర్మ దుల్కర్ సల్మాన్ ఒక రేంజ్ లో పొగిడేశాడు. అతడు అద్భుతమైన నటుడు అంటూ కితాబునిచ్చాడు.
అంతటితో ఆగక.. సల్మాన్ తండ్రి మమ్ముట్టీని కూడా లాగాడు. ప్రసిద్ధ నటుడిగా పేరు పొందిన మమ్ముట్టీ కూడా దుల్కర్ ను చూసి నటనను నేర్చుకోవాలని వర్మ ట్వీట్ చేశాడు. దుల్కర్ ముందు మమ్ముట్టీ జూనియర్ ఆర్టిస్టులాంటి వ్యక్తి అంటూ వర్మ ట్వీట్్ పేల్చాడు.
ఈ పోలిక పరమ చెత్తగా ఉన్నా.. మీడియాలో అయితే హైలెట్ అయ్యింది. దీనిపై దుల్కర్ స్పందించాడు. వర్మ పేరును ప్రస్తావించకపోయినా..తనకూ, తన తండ్రికి పోలిక వద్దని దుల్కర్ స్పష్టం చేశాడు. ‘నేను మరో పది జన్మలు ఎత్తినా.. నటుడిగా ఎంత సాధించినా.. ఇప్పటి వరకూ నా తండ్రి సాధించిన దానిలో నా ఖ్యాతి మిలియన్ వంతుకు కూడా సరిపోదు..” అంటూ సల్మాన్ ఒక ట్వీట్ పోస్టు చేశాడు. ఇది పరోక్షంగా వర్మకు చెప్పిన ఘాటైన సమాధానం లాగానే ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -