Saturday, May 4, 2024
- Advertisement -

బాబు భూముల బాగోతంలో ఇరుక్కుపోతున్నాడా?!

- Advertisement -

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిహోదాలో భూముల బాగోతంలో ఇరుక్కుపోతున్నాడా? ఈ భూముల పందేరం భవిష్యత్తులో పెద్ద కుంభకోణంగా తేలుతుందా? పరిశ్రమ అంటే..భూములు ఇచ్చేస్తాం.. అంటూ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్న ఆయనపై ఇప్పుడు అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాజధాని వ్యవహారంతో సహా ప్రతి విషయంలోనూ చంద్రబాబు భూముల ప్రస్తావన తెస్తున్నాడు.. రైతుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు!

 

మూడు పంటలూ పండే ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని భావించడంతోనే బాబు మొదటి వివాదానికి బీజం వేశాడు. అది కూడా ఏదో తక్కువ భూమిలో రాజధాని అనకుండా.. వేల ఎకరాలు కావాలని ఆయన పదేపదే చెప్పుకొన్నాడు. అందుకు తగ్గట్టుగా సీఆర్ డీఏ అంటూ వేల ఎకరాల భూమిని రాజధాని పేరిట రైతుల నుంచి స్వాధీనం చేసుకొంటున్నాడు. పైసా ఖర్చు లేకుండా కేవలం హామీలను మాత్రమే ఖర్చు చేస్తూ బాబు రైతుల నుంచి భూములు తీసుకొంటున్నాడు. ఇవన్ని వాళ్లపై పరోక్షంగా బెదిరిపించి భూములను ప్రభుత్వం సొంతం చేసుకొంటోంది.

రాజధాని విషయంలో బాబు ఆలోచనను తప్పుపట్టింది కేవలం ఆయన వైరి పక్షం అయిన ప్రతిపక్షం వారు మాత్రమే కాదు… ఏపీ రాజధాని విషయంలో ఏర్పాటు అయిన కమిటీకి నేతృత్వం వహించిన శివరామకృష్ణన్ వంటి వాళ్లు కూడా బాబు తీరును తప్పు పట్టారు. అయితే ఇలాంటి వారి అభిప్రాయాలకు బాబు విలువనివ్వడం లేదు. తన కన్నా తెలిసిన వాళ్లు లేరు.. తన మంత్రి నారాయణ కన్నా సమర్థుడు లేడు..అన్నట్టుగా బాబు వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో విమానాశ్రయానికి పదిహేనువందల ఎకరాల భూమి.. ఈషా ఫౌండేషన్ కు భారీ స్థాయిలో భూ కేటాయింపులు.. వంటి అంశాలు కూడా బాబుపై మరకల్లానే పడుతున్నాయి. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ఏడాది  పూర్తి అవుతున్న తరుణంలో బాబు రైతుల నుంచి భూములు లాక్కోవడం.. విదేశీ పర్యటనలు చేయడం తప్ప.. సాధించి పెట్టింది ఏమీ లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయిప్పుడు. మొత్తానికి ఈ భూముల వ్యవహారాలు బాబును ఎక్కడికి తేల్చేనో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -