Sunday, May 19, 2024
- Advertisement -

భార‌త వ్య‌వ‌సాయంపై హాలీవుడ్ సినిమా

- Advertisement -

భార‌త వ‌రి సాగుపై ఓ హాలీవుడ్ సినిమా వ‌స్తోంది. బాస్మ‌తి పండించే విధానంపై విదేశానికి చెందిన ఓ శాస్త్రవేత్త తను జన్యుపరంగా మార్పు చేసిన వరి ధాన్యాన్ని విక్ర‌యించ‌డానికి భారత‌దేశానికి వస్తుంది. ఆ ధాన్యంతో రైతులకు మేలు జరుగుతుందని భావిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడి అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఆ ధాన్యం వల్ల రైతులకు మేలు జరిగిందా? లేదా? అనే విషయాన్ని ‘బాస్మతి బ్లూస్‌’ సినిమా చూడాలి.

బాస్మ‌తి బియ్యం ప్ర‌ధాన ఇతివృత్తంపై ఈ సినిమా వ‌స్తోంది. డాన్‌ బారన్ ద‌ర్శ‌క‌త్వంలోఈ సినిమా రూపొందుతోంది. బ్రీ లార్సన్‌, ఉత్కర్ష్‌ అంబుడ్క‌ర్‌, మంచు లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రల్లో ఈ సినిమా వ‌స్తోంది. షౌట్‌ ఫ్యాక్టరీ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్టీవెన్‌ అర్గిలా మ్యూజిక్ అందిస్తున్నారు.

మంచు లక్ష్మి ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాను ట్రైలర్‌ను ఇటీవ‌ల విడుదల చేశారు. ‘నా కొత్త హాలీవుడ్‌ సినిమా త్వరలో విడుదల కాబోతోంది’ అని మంచుల‌క్ష్మి ట్వీట్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -