Saturday, May 18, 2024
- Advertisement -

ఇకపైన కూడా నేను డబ్బు మనిషిని కాదు అని చెప్పగలవా పవనూ?

- Advertisement -

ఇంటర్మీడియెట్ ఫెయిల్…….. తాను యాక్ట్ చేసిన ఎక్కువ క్యారెక్టర్స్ అన్నీ కూడా అయితే డాన్‌, గన్‌ల పంచాయితీ లేకపోతే ఆవారా కుర్రాడి బాపతు క్యారెక్టర్స్……. అఫ్కోర్స్ తెలుగు సినిమా హీరోలందరిలాగే చివరికి వచ్చేసరికి ఆ ఆవారా వ్యక్తే అందరూ మెచ్చే హీరో అవుతాడనుకోండి……. ఆ విషయం పక్కనపెడితే యాక్టింగ్ స్కిల్స్ పరంగా పవన్‌ది కనీస స్థాయి కూడా కాదు. ఆ విషయం పవనే స్వయంగా చెప్పుకున్నాడు. మరి పవన్‌కి ఎందుకు ఇంతమంది హార్డ్ కోర్ అభిమానులు?

ఎందుకంటే సినిమాల కంటే బయట గొప్పగా నటిస్తాడుకాబట్టి……. డబ్బు వ్యామోహం లేదు, పొగడ్తలు ఇష్టం ఉండదు, వ్యవసాయం అంటే ఇష్టం, ప్రజలకు ఏదో చేయాలన్న తపన, ఆ ప్రజల కోసం తన చిన్నప్పటి నుంచీ కూడా తాను తపనపడిపోతున్నట్టుగా ఇచ్చిన కలరింగ్, నక్సలైట్లలో చేరాలనుకున్నా, హిమాలయాలకు పారిపోవాలనుకున్నా లాంటి మాటలు… మీడియా కెమేరాల ముందు చేసిన నటనతో పవన్‌ అభిమానులను మూఢాభిమానులుగా చేసుకున్నాడు.

పొగడ్తలు ఇష్టం లేదంటాడు……. కానీ చిరంజీవితో సహా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరి సినిమా ఫంక్షన్స్ చూడండి……… అత్యంత ఎక్కువ భజన వినిపించేది ఎవరి గురించి? ఎవరి సినిమా ఫంక్షన్స్‌లో …? ఇక పవన్ భజన చేయరేం అని కొంతమంది బ్యాచ్ ప్రత్యేకంగా తయారై ఇతర హీరోల సినిమా ఫంక్షన్స్‌లో కూడా పవన్ భజన వినిపించేలా చేయడం……. ఒకసారి మీరే ఆలోచించుకోండి…… పవన్ మాటల్లోని నిజాయితీ మీకే తెలుస్తుంది.

……..ఇక ఇప్పుడు అజ్ఙాత వాసితో పూర్తిగా బయటపడిపోయాడు పవన్. తెలుగులో టాప్ రేంజ్ స్టార్ హీరోలందరూ కూడా రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో పర్సంటేజ్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అజ్ఙాతవాసి సినిమాకు కోటాను కోట్ల లాభాల కోసం తన రాజకీయ పార్టీని, తన రాజకీయ ఆశయాలను అని చెప్పిన గొప్ప మాటలను కడా ఫణంగా పెట్టేశాడు పవన్. అత్యంత ఎక్కువ షోలు పడడం కోసం, టిక్కెట్ రేట్లు ఇష్టారీతిన పెంచుకునే అవకాశం కోసం అన్ని అడ్డదార్లూ తొక్కేశాడు. రేట్లు పెంచితేనేం……. ఇష్టమున్నోడు చూస్తాడు అని చాలా సులభంగా చెప్పొచ్చు. కానీ ఆ ఇష్టమున్నోడు ఎవడు? పవన్ అభిమాని? వాడి జేబులోకి వచ్చే పచ్చనోటు ఎవరి కష్టం? అతని తల్లిదండ్రుల కష్టార్జితం. ఆ కష్టార్జితాన్ని దోచుకోవడం కోసం….. తన అభిమానుల ఇష్టాన్ని క్యాష్‌గా మార్చుకోవడం కోసం పవన్ తొక్కుతున్న అడ్డదార్లు కనిపిస్తున్నాయా?

సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా కొని జీవితాన్నే నష్టపోయిన పవన్ అభిమాని అయిన ఒక డిస్ట్రిబ్యూటర్‌ని పవన్ చుట్టూ ఉన్న మాఫియా బెదిరించినప్పుడు, ఆ పవన్ అభిమాని నిరాహారదీక్షకు కూర్చున్నప్పుడు పవన్ కనీసం పట్టించుకోకపోవడంతోనే పవన్ నైజం బయటపడింది. ఆ సినిమాను కొనమని అతనికి చెప్పింది……. నష్టపోతే నేనున్నాను అని భరోసా ఇచ్చింది పవన్‌నే మరి. తీరా అతనికి కోట్లు నష్టమొచ్చాక మాత్రం పూర్తిగా వదిలేశాడు. అది ఆ అభిమానాన్ని పవన్ క్యాష్ చేసుకున్న విధానం.

ఇప్పుడిక అభిమానుల అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఏ ఇతర తెలుగు హీరో కూడా దిగజారని స్థాయికి పవన్ దిగజారుతూ కోట్లు కొల్లగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల తర్వాత కూడా పవన్‌కి డబ్బంటే ఆశలేదు అని ఆయన అభిమానులు చెప్పగలరా? పవన్ కేసీఆర్‌ని కలవడం…….త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఙాతవాసి కోసం తలసాని శ్రీనివాసయాదవ్‌ని కలవడం……ఎందుకు? ప్రజల కోసం రాజకీయం అన్నపవన్ …….ఇప్పుడు తన ప్యాకేజీల కోసం, తన సినిమా కలెక్షన్స్ పెంచుకోవడం కోసం రాజకీయం చేస్తున్న వైనం అర్థమవుతోందా అభిమానులూ? ఇకపై కూడా పవన్‌కి స్వార్థం లేదు? డబ్బు మనిషి కాదు అని చెప్పగలరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -