Monday, May 13, 2024
- Advertisement -

ఆ హీరో థియేటర్లో ఫట్ … యూట్యూబ్లో హిట్

- Advertisement -

టాలీవుడ్లో అన్ని కాంపౌండ్ హీరోలు సక్సెస్ అవుతున్నారు గాని మంచు వారబ్బాయిలు సక్సెస్ అయ్యే మార్గం మాత్రం ఎవ్వరూ కనిపెట్టట్లేదు. దీంతో మంచువారికి ఆ దిగులు మిగిలిపోయింది.విష్ణు అప్పుడపుడు హిట్ లు కొట్టినా హీరోయిజం ఇంకా రాలేదు. బట్ హిట్ కొట్టని మనోజ్ కు మాత్రం పోటుగాడు అనే బిరుదొచ్చేసింది. ఒక సినిమా కోసం మనోజ్ పడే కష్టం అంతా ఇంతాకాదు. అయినప్పటికీ సక్సెస్ వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంటుంది.

పోటుగాడు,మిస్టర్ నోకియా చిత్రాల ఫలితాలు అలా వచ్చిపోయినవే. కాని ఒకటి మాత్రం వాస్తవం . మనోజ్ రాక్ స్టార్ అంటే ఎవ్వరూ కాదనరు. మనోడు నిజంగానే హీరో మెటీరియల్ .ఇదే విషయాన్ని ఆల్ రెడీ నెటిజన్లు గుర్తించారు. ఒపుకున్నారు కూడా. దీనికి బెస్ట్ ఎక్జాంపుల్ గుంటూరోడు సినిమా. ఈమూవి థియేటర్లో కనిపించకుండా పోయింది.

తాజాగా యూ ట్యూబ్ లో మ్యాంగో రామ్ తెలివిగా ప్రమోట్ చేసి మరీ వదిలాడు. అంతే కట్ చేస్తే… మూడు రోజుల వ్యవధిలోనే మిలియన్ వ్యూస్ వచ్చాయి. మనం అనుకోవచ్చు…వన్ మిలియన్ వ్యూస్ ఒక్క రోజులోనే ఫలాన హీరో సినిమాకు వచ్చాయి కదా అని. ఇక్కడ మనం చెపుకునేది ఓ ఫుల్ లెన్త్ సినిమా గురించి.అందుల్లోను ఫ్లాపైనా చిత్రం గురించి.

ఈ సినిమా హిందీలోనో లేదా మళయాలంలోనో డబ్ చేసి రిలీజ్ చేసిన చిత్రం కాదు. పక్కా తెలుగులోనే రిలీజ్ చేసిన వెంచర్ .గుంటూరోడు చిత్రం సాధించిన రికార్డ్ చూసి నెటిజన్లు చాలామంది ఈసినిమా గురించి పాజిటివ్ గా స్పందంచారు.ఇంతమంచి సినిమాను మనం థియేటర్లో చూడలేకపోయామే అని. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం. మంచి విషయమున్న డైరెక్టర్ మనోజ్ ను టేకప్ చేసి అతన్ని రీలాంచ్ చేస్తే..చాలా బాగుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -