Monday, May 6, 2024
- Advertisement -

కలెక్టర్‌ని కొట్టండి…… కార్యాలయాలకు తాళాలు వేయండిః టిడిపి ఎమ్మెల్యే

- Advertisement -

బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి పదవిలో ఉన్నాడు. క్రమశిక్షణకు మారుపేరని, సంస్కారవంతమైన పార్టీ అని పచ్చ మీడియా ఎప్పూడ భజన చేస్తూ ఉండే ఎమ్మెల్యే. అయితేనేం రెచ్చిపోయాడు. కాదు ……. కాదు…… రెచ్చిపోయినట్టుగా నటిస్తూ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కలెక్టర్‌ని కొట్టిన…… మీరూ కొట్టండి అనేలా మాట్లాడేశాడు.

టిడిపి ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య. బీసీల హక్కుల కోసం పోరాడుతున్నానని చెప్పి…… ముఖ్యమంత్రి పదవి అనేసరికి ఎంచక్కా టిడిపి పార్టీలో చేరిపోయి తాను మాత్రం ఎమ్మెల్యే అయిపోయాడు. బీసీల సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. అయినా ఒక కులం ప్రజల సమస్యలు అనేముంది? సామాన్య ప్రజలందరి కష్టాలూ అలాగే ఉన్నాయి. కాకపోతే పోరాటం చేస్తాం అని ముందుకు వచ్చేవాళ్ళే ఏదో ఒక కులం రంగుపూసుకుని ఏడు దశాబ్ధాలుగా మాటలు చెప్తూనే ఉన్నారు. ప్రజల బాగోగుల్లో మార్పులు వచ్చింది ఏమీ లేదు. ప్రజల కష్టాలు మాత్రం పెరిగాయన్నది నిజం. వాళ్ళ కోసం పోరాటం చేస్తామన్న నాయకులు మాత్రం పదవి పరంగా, ఆర్థికంగా గొప్పగా ఎదిగారు. ఆ నాయకులకు సీట్లిచ్చిన పార్టీలు కూడా ఎంతో కొంత బాగుపడ్డాయి.

ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న కృష్ణయ్యకు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఈ మూడున్నరేళ్ళలో చాలానే మార్పులు తీసుకొచ్చి ఉండేవాడు. తన నియోజకవర్గానికి చాలానే చేసి ఉండేవాడు. లోక్ సత్తా జెపిలాగే ఈయన కూడా గెలిపించిన నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ఇక అతి త్వరలోనే ఎన్నికల మూడ్ రానుండడంతో ఇప్పుడు మరోసారి బీసీ సమస్యలు అంటూ హల్చల్ చేయాలని చూస్తున్నాడు. చిత్తశుద్ధితో పనులు చేయడం కష్టం…….. కానీ యువతను రెచ్చగొట్టడం సులభం అన్నది కొంతమంది నాయకుల పాలసీ. అందుకే ఇప్పుడు ఈయన ……….. ‘మీ వయసులో నేను కలెక్టర్‌ని కొట్టిన, ఆర్డీవో కార్యాలయాలకు తాళాలు వేయించిన……… నాలాగే మీరూ చేయాలి’ అంటూ ఆవేశపూరిత ప్రసంగాలతో యువతను రెచ్చగొడుతున్నాడు. ఎమ్మెల్యే పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడడం భావ్యం కాదన్న విషయం ఈ ఎమ్మెల్యేకు ఎవరైనా గుర్తు చేస్తే బాగుంటుంది కదా? అలాగే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఈ టిడిపి ఎమ్మెల్యేపై చంద్రబాబు ఏమైనా చర్యలు తీసుకుంటాడా? పోలీసులైనా స్పందిస్తారా? ఆ అవకాశమే లేదు. ఎందుకంటే మన పేరు గొప్ప ప్రజాస్వామ్యంలో కుల రాజకీయాల మహత్యం అలా ఉంటుంది మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -