Monday, May 20, 2024
- Advertisement -

పుట్టిన రోజు సందర్భంగా ప్రకటన

- Advertisement -

మంచు మనోజ్. కలెక్షన్ కింగ్ మెహన్ బాబు నట వారసుడు. శుక్రవారం నాడు పుట్టిన రోజు జరుపుకున్న మనోజ్ మూడు కొత్త చిత్రాల్లో నటిస్తున్నట్లు ప్రకటించారు. సాగర్ ప్రసన్న దర్శకత్వంలో సీతామహాలక్ష్మి చిత్రంలో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సూరయ సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు.

వరుణ్ అట్లూరి నిర్మాతగా కె.సత్య దర్శకుడిగా క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మరో చిత్రంలో కూడా మనోజ్ నటిస్తున్నారు. ముచ్చటగా మూడో చిత్రం ఎస్.ఎస్. రెడ్డి, ఎన్.లక్ష్మీకాంత్ నిర్మాతలుగా ఆండ్రూస్ నౌతాక్కి దర్శకత్వంలో నటిస్తున్నారు.

మేజర్ చంద్రకాంత్ చిత్రంతో తెరంగేట్రం చేసిన మనోజ్ హీరోగా పలు చిత్రాల్లో నటించారు. తన కెరీర్ లో ఎక్కడా ఎలాంటి గ్యాప్ లేకుండా చిత్రాలు చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు మంచు మనోజ్. ఆల్ ది బెస్ట్ మనోజ్.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -