Tuesday, May 21, 2024
- Advertisement -

అక్క సినిమాకు త‌మ్ముడు మ్యూజిక్ అది హాలీవుడ్ సినిమాకు

- Advertisement -

మంచు కుటుంబానికి హాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌తో కొంచెం ప‌రిచ‌యం ఉంది. ఆ నేప‌థ్యంలోనే ఇప్పుడు ఆ కుంటుంబంలోని న‌టి మంచు ల‌క్ష్మీప్ర‌స‌న్న ఓ సినిమా చేస్తోంది. హాలీవుడ్‌లో వ‌స్తున్న ఓ సినిమాలో మంచు ల‌క్ష్మి ఓ పాత్ర పోషిస్తోంది. అయితే అక్క‌కు తోడుగా త‌మ్ముడు మంచు మ‌నోజ్ చేరాడు. మనోజ్ న‌టుడిగానే కాక మ‌రికొన్ని క‌ళ‌ల్లో ఆరితేరాడు. ఫైట్ల కంపోజింగ్‌, కొరియోగ్ర‌ఫీ, ర‌చ‌న‌, గాత్రం త‌దిత‌ర క‌ళ‌లు మ‌నోజ్‌లు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. అయితే ఇప్పుడు మనోజ్ నుంచి మ‌నం మ‌రొక క‌ళ విన‌బోతున్నాం. అదే మ్యూజిక్.

మంచు ల‌క్ష్మి బాస్మతి బ్లూస్ సినిమాలో న‌టిస్తుండ‌గా ఈ సినిమాకు మ‌నోజ్ సంగీతం అందించాడు. మనోజ్ అక్క మంచు లక్ష్మి ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించింది. అందులో ఆమె పాత్ర పేరు.. సీత. ఆస్కార్ విన్నింగ్ నటి బ్రీ లార్సన్ ‘బాస్మతి బ్లూస్’లో హీరోయిన్‌గా న‌టించిన ఈ  సినిమా ఇటీవల‌ హాలీవుడ్‌లో విడుదలైంది. ఆన్ డిమాండ్ ఈ సినిమాకు షోలు వేస్తున్నారు.

దీనికి మ‌నోజ్‌ స్నేహితుడు.. సంగీత దర్శకుడు అచ్చు రాజమణితో కలిసి మనోజ్ సంగీతం అందించాడట. రాజ‌మ‌ణి మనోజ్ చాలా సినిమాలకు సంగీతం అందించాడు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య స్నేహం బ‌ల‌ప‌డింది. సినిమాకూ మ్యూజిక్ విష‌యంలో మనోజ్ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తు ఉండేవాడు. ఆ స‌మ‌యంలోనే మ్యూజిక్‌పై ఆస‌క్తి క‌న‌బ‌ర్చి నేర్చుకున్నాడ‌ని తెలుస్తోంది. ఆ అనుభ‌వంతో ఇప్పుడు రాజ‌మ‌ణితో కలిసి ‘బాస్మతి బ్లూస్’కు సంగీతం సమకూర్చాడట మనోజ్. హాలీవుడ్ సినిమాలో మనోడి సంగీతం టాలెంటుకి పేరొస్తుందో లేదో చూడాలి.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -