- Advertisement -

మంచు మూడోత‌రం వార‌సుడు వ‌చ్చేశాడు

- Advertisement -

 

ఎవ‌రూ ఆప‌లేరు అంటున్న మంచు విష్ణు

సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచు కుటుంబానికి ఓ ప్ర‌త్యేకం ఉంది. ఆ కుటుంబమంతా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారే. త‌ల్లీదండ్రి, కొడుకులు, కూతురు సినీ ప‌రిశ్ర‌మ‌లో బిజీగా ఉంది. ఈ కుటుంబం సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికీ సంబంధం లేకుండా త‌మ సినిమాలు తాము చేసుకుంటూ వెళ్తుంటారు. ఆ విధంగా వెళ్తూనే మంచి విజ‌యాలు అందుకుంటూ తాము సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నామ‌ని ఉనికిని చాటుకుంటున్నారు.

అయితే మంచు కుటుంబంలో కొత్త సంవ‌త్స‌రం కొత్త అతిథి వ‌చ్చేశారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల‌కు తండ్రి అయిన మంచు విష్ణు మ‌రోసారి తండ్రి అయ్యాడు. విష్ణుకు కుమారుడు జ‌న‌వ‌రి 1వ తేదీన జ‌న్మించాడు. ఆ చిన్నారికి విష్ణు ఆస‌క్తిక‌ర పేరు పెట్టారు. అవ్రామ్ భ‌క్త అని పేరు పెట్టిన‌ట్టు ట్విట్ట‌ర్‌లో విష్ణు తెలిపారు. అవ్రామ్ అంటే ‘ఎవ‌రూ ఆప‌లేరు’ అని అర్థమని చెప్పారు. ఈ చిన్నారిని అరియానా `బేబీ ల‌య‌న్‌`అని, వివియానా `బేబీ టెడ్డీ బేర్‌` అని పిలుస్తున్న‌ట్టు విష్ణు సంతోషం వ్య‌క్తం చేశారు.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -