Saturday, April 27, 2024
- Advertisement -

నేనే త‌ప్పు చేశా.. వైర‌ల్ అవుతున్న ప్ర‌దీప్ వీడియో..

- Advertisement -

డిసెంబరు 31న రాత్రి డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయిన స్టార్ యాంకర్ ప్రదీప్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ పోస్టు చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేను త‌ప్పు చేశాన‌ని త‌న‌లాగా ఎవ‌రూ అలాంటి త‌ప్పు చేయ‌వ‌ద్ద‌ని ఓవీడియోను విడుద‌ల చేశారు. ఇది నెట్‌లో వైర‌ల్ అవుతోంది.

డ్రంక‌న్ అండ్ డ్రైవ్‌లో దొరికి పోయిన ప్ర‌దీప్ పోలీసుల కౌన్సెలింగ్‌కు డుమ్మా కొట్ట‌డంతో ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌దీప్ పారిపోయాడంటూ పోలీసులు కూడా అధికారంగా ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఈ వివాదం ఇంకా పెద్దదిగా కాకముందే ప్రదీప్ మేల్కొన్నాడు. పోలీసుల కౌన్సెలింగ్‌కు తాను ఎందుకు హాజరుకాలేకపోయిందీ అందులో పేర్కొన్నాడు.

అందరికీ నమస్కారం అంటూ ప్రారంభమైన ఆ వీడియోలో ‘‘నేను మీ ప్రదీప్ మాచిరాజు. డిసెంబరు 31న జరిగిన సంఘటన గురించి అందరికీ తెలుసు. పోలీసుల కౌన్సెలింగ్‌కు కానీ, దాని తర్వాత జరిగే ప్రొసీడింగ్స్‌కు కానీ హాజరయ్యేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అయితే ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రోగ్రామ్స్, ఇతర ఈవెంట్ల వల్ల కొంత బిజీగా ఉన్నా. షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వల్లే రాలేకపోయాను తప్పితే మరో కారణం ఏమీ లేద‌న్నారు.

గతేడాది డ్రంకెన్ డ్రైవ్ గురించి చెప్పిన నేను దురదృష్టవశాత్తు అందులోనే దొరికిపోయాను. నేను చేసిన తప్పును ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నా. అందరూ నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా అని పేర్కొన్నాడు. తాను పరారీలో లేనని, త్వరలోనే పోలీసుల ఎదుట హాజరు అవుతానంటూ అందులో పేర్కొనడం గమనార్హం .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -