Friday, May 3, 2024
- Advertisement -

అ! అనిపించిన టీజ‌ర్‌

- Advertisement -

నాని సినిమా టీజ‌ర్ విడుద‌ల‌

తొలిసారి నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన నేచురల్ స్టార్ నాని నిర్మాతగా “ అ” సినిమా తీస్తున్నాడు. క‌థ‌నే హీరోగా పేర్కొంటూ ఈ సినిమాను రూపొందిస్తున్న‌ట్లు తొలి నుంచి నాని చెబుతూ వ‌స్తున్నాడు. అయితే ఈ సినిమా టీజర్‌ను గురువారం (జనవరి 4) విడుదల చేశారు. నిమిషం పాటు ఉన్న టీజ‌ర్ అంద‌ర్నీ అ! అనిపిస్తుంది.

అనగనగా ఓ రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకు అంటూ నాని కథ చెబుతాడు. దానికి ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్‌లో చెట్టు నేను విత్త‌నంగా ఉన్న‌ప్ప‌టి నుంచి వింటున్న ఓ అదే క‌థ అని అంటాడు. అయితే ఈ టీజ‌ర్ చూడు అని నాని వాయిస్ ఓవ‌ర్‌లో చేప‌గా చెబుతాడు. ఆ వెంట‌నే నిత్య‌మీన‌న్‌, అవ‌స‌రాల శ్రీనివాస్‌, ప్రియ‌ద‌ర్శి, రెజినా, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ముర‌ళీ శ‌ర్మ పాత్ర‌లు ప‌రిచ‌యం అవుతాయి. ఆయా పాత్ర‌లు కొంచెం కోపంగా ఉంటూ దేనికోసం ఆరాట‌ప‌డుతూ క‌నిపిస్తాయి. చివర‌కు తకీ హీరో ఎవరో అనే మాటకీ కథే హీరో.. అన‌గ చెట్టు అ! అంటాడు. అదే టైటిల్ అనే అంటారు.

ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మొద‌టి నుంచి పోస్ట‌ర్‌ల‌తో ఆక‌ట్టుకున్న ఈ సినిమా ముచ్చ‌ట టీజర్‌తో మ‌రో హైప్‌కు వెళ్లింది. ఈ సినిమాలో చేప పాత్ర‌కి నాని వాయిస్ ఓవ‌ర్ ఇస్తుండ‌గా, చెట్టు పాత్రకి ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నారు. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయ‌నున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -