Sunday, May 5, 2024
- Advertisement -

హీరో మంచు విష్ణు రోడ్డు ప్ర‌మాదం : వీడియో

- Advertisement -

హీరో మంచు విష్ణుకి రోడ్డు ప్ర‌మాదం ఇప్పుడు జ‌రిగింది కాదులేండీ. ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా షూటింగ్ టైంలో జ‌రిగిన ప్రమాదం వీడియోని విష్ణు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సినిమా షూటింగ్‌ మలేషియాలో జరుగుతుండగా ఓ యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ సమయంలో విష్ణు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడ్డారు. కాలికి, భుజానికి గాయాలయ్యాయి.

ఆయన వెనుక కూర్చోన్న ప్రగ్యాకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.‘స్టంట్స్‌ ఎల్లప్పుడూ సురక్షితంగా జరగవు. టైం బాగాలేకపోయి ఉంటే తలకు తీవ్ర గాయాలు అయ్యేవి’ అని విష్ణు ట్వీట్‌ చేశారు. ఈ సినిమాకు జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయిక. ప్రిల్‌ 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -